వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం

వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం

వంచనకు, వెన్నుపోటుకు పుట్టిన ఉన్మాది చంద్రబాబు నాయుడు. ఆ ఉన్మాదత్వంతోనే పిల్లనిచ్చిన మామను చంపాడు. ఎన్టీఆర్ గారిని 73 ఏళ్ల వయసులో వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు 72 ఏళ్లు వయసున్న ఈ ఉన్మాది చంద్రబాబును ఆయన కొడుకు కూడా వెన్నుపోటు పొడుస్తాడు. నా..రా అంటే నాసిరకం రాజకీయ నాయకుడు. అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై కక్షకట్టాడు. బాధ్యతలేని ప్రతిపక్ష నాయకుడు ఉన్మాది చంద్రబాబును ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి. కిక్ బాబు.. సేవ్ ఏపీ అన్నదే మన నినాదం. చంద్రబాబు నిర్వహిస్తున్నది మహానాడు కాదు.. మహా స్మశానం. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమై ఇప్పడు శ్రాద్ధం/పిండం పెట్టినట్టు మహానాడు పెడుతున్నాడు. ఉన్నతాశయంతో రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో రామారావు గారు లేరు. ఆ పార్టీలో ఇప్పుడున్నవారంతా ‘కామారావు’లే.