DCI ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా YSRCP తరుపున పోరాటం చేస్తాం.

DCI ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా YSRCP తరుపున పోరాటం చేస్తాం.

DCI ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా YSRCP తరుపున పోరాటం చేస్తాం.

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ని ప్రైవేటీకరణ చెయ్యడాన్ని ఆపాలి. DCI ప్రస్థుతం లాబాలలో ఉన్నటువంటి కేంద్రప్రభుత్వ సంస్థ. ఎప్పుడైనా, ఎక్కడైనా నష్టాలలో ఉన్నటువంటి ప్రబుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తారు. ఈవిషయమై నేను రాజ్యసభలో సంబందించిన మంత్రిని ప్రశ్నించడం జరిగింది.

ఆరోజు నాకు లిఖిత పూర్వకంగా DCI ని ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన ప్రబుత్వ పరిగణలో లేదని  ఆ పరిస్థితి ఉత్పన్నం అయ్యే అవకాశం లేదని స్వయంగా కేంద్రమంత్రి Ministry of Shipping ‘SagarMala’ గారు సమాదానం ఇచ్చారు. ప్రస్థుతం దానికి విరుద్దంగా ప్రైవేటీకరణ  చెయ్యడం జరుగుతున్నది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను.

ఈ DCI ప్రైవేటీకరణ ఆపాలంటూ వెంకటేష్ ఆత్మబలిదానం చేశారు. దానికి కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు బాద్యత వహించి, చనిపోయినటువంటి వెంకటేష్ గారి కుట్టుంబానికి పరిహారం చెల్లించి ఆకుట్టుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.

DCI ని ప్రైవేటీకరణ చెయ్యవద్దని శ్రీ నితిన్ గడ్కారి ని కోరుతూ లెటర్ రాయడం జరిగింది. రాబోవు రాజ్యసభ సమావేశాల్లో DCI ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా YSRCP తరుపున పోరాటం చేస్తాం.