సీఎం రమేష్ ఒక ఘరానా మోసగాడు, కల్తీ సారా సామ్రాజ్యంతో కోట్లకు పడగలు! పార్ట్ – 3
పార్ట్ – 3
- 1986లో చిత్తూరు పట్టణంలోని మన్మోహన్ బిల్డింగ్స్ అనే అద్దె నివాసం నుంచి సీఎం రమేష్ తన తండ్రి మనిస్వామి నాయుడుతో కలిసి దొంగ సారా వ్యాపార ప్రస్థానం ప్రారంభించాడు.
- అప్పట్లో రమేష్ ఇండ్-సుజికి బైక్‌పై తిరుగుతుండేవాడు.
- రమేష్ తండ్రి మునిస్వామి నాయుడికి స్థానికుడైన హరి ప్రసాద్ అనే సారా కాంట్రాక్ట్ర్‌ర్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో ఆయనతో కలిసి చిత్తూరు టౌన్‌లోని కొండమిట్ట ప్రాంతంలోగల ఆనంద థియేటర్ వెనుక మునిస్వామి, రమేష్ సారా వ్యాపారం ప్రారంభించారు.
- ఈ క్రమంలోనే తమ దగ్గర పని చేసే ధనుంజయుడు అనే గుమస్తా సాయంతో సీఎం రమేష్, అతని తండ్రి మునిస్వామి ఏకంగా సారా ప్యాకెట్లు తయారు చేసే మిషన్లను ఏర్పాటు చేసి నాటు సారా తయారీ మొదలెట్టారు.
- దొంగ సారా తయారీ, అమ్మకాల ద్వారా అక్రమార్జన ఇబ్బడి ముబ్బడిగా పెరగడంతో అప్పటి వరకు టూ వీలర్‌పై తిరిగిన సీఎం రమేష్ మారుతీ 800 కారులో తిరగడం ప్రారంభించాడు.
- అక్రమ సారా వ్యాపారం విస్తరణలో భాగంగా రమేష్ యడమరి మండలాన్ని దొంగ సారాకు అడ్డాగా మార్చుకున్నాడు. మధ్య ప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున స్పిరిట్‌ను అడ్డదారుల్లో తెప్పించుకుని ఏకంగా కల్తీ సారా యూనిట్‌ను స్థాపించాడు. ఇక్కడ తయారైన రెక్టిఫైడ్ స్పిరిట్‌ను కేరళ రాష్ట్రానికి అక్రమంగా రవాణా చేస్తూనే, చెన్నై నగరంలో అప్పట్లో పేరుమోసిన గూండా వీరమణి అండతో తమిళనాడు మొత్తం కల్తీ సారా రవాణా చేస్తూ సీఎం రమేష్ తన అక్రమ సారా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అప్పట్లో తమిళనాడులో సారాపై నిషేధం ఉండటంతో సీఎం రమేష్ ఆధ్వర్యంలోని కల్తీ సారా ముఠా కార్యకలాపాలు తారస్థాయికి చేరాయి.
- ఆ విధంగా సంపాదించిన అక్రమార్జనను పెట్టుబడిగా పెట్టి సారా వ్యాపారంలో తన భాగస్వామి అయిన హరి ప్రసాద్‌తో కలిసి రమేష్ చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు ప్రారంభించాడు. కాంట్రాక్ట్ పనుల ద్వారా వచ్చిన 40 కోట్ల రూపాయల లాభాలను హరి ప్రసాద్‌కు పంచకుండా రమేష్ అతనిని దారుణంగా మోసం చేశాడు. అద్దె ఇంటితో జీవితం ప్రారంభించిన రమేష్ అక్రమార్జనతో కోట్లకు పడగలెత్తిన తర్వాత పట్టణంలోని బీవీ రెడ్డి కాలనీలో విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నాడు.
- 1996లో సీఎం రమేష్ తండ్రి మునిస్వామి నాయుడు కడప జిల్లా మైదుకూరుకు చెందిన కుళ్ళాయి శెట్టితో కలిసి కల్తీ సారా అమ్మకాలను విచ్చలవిడిగా కొనసాగించాడు. ఈ క్రమంలో కల్తీ సారా తాగి సుమారు 100 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ కేసులో పీడీ యాక్ట్ కింద పోలీసులు సీఎం రమేష్ తండ్రిని, కుళ్ళాయి శెట్టిని అరెస్ట్ చేసి ముషీరాబాద్ జైలులో పెట్టారు.
- సిఎం రమేష్ తొలిసారిగా (2012లో) రాజ్యసభకు నామినేట్ అయినప్పుడు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో తన నేర చరిత్రను, తనపై ఉన్న కేసుల వివరాలేవీ అందులో పొందుపరచలేదు. అప్పటికే రమేష్‌పై హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసు స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదై ఉంది. ఆ సెక్షన్ల వివరాలివి… ఐపీసీ 12-బీ (క్రిమినల్ కుట్ర), సెక్షన్ 341 (అక్రమ అవరోధం), సెక్షన్ 403 (మోసపూరితంగా ఆస్తుల దుర్వినియోగం), సెక్షన్ 409 (నేరపరమైన విశ్వాస ద్రోహం), సెక్షన్ 418 (రక్షించాల్సిన వ్యక్తినే మోసం చేయడం), సెక్షన్ 447 (అక్రమ ప్రవేశం). ఇన్ని సెక్షన్ల కింద తనపై కేసు నమోదైనప్పటికీ ఎన్నికల అఫిడవిట్‌లో ఈ కేసు వివరాలను ఉద్దేశపూర్వకంగానే పేర్కొనకుండా రమేష్ దాచిపెట్టిన విషయాన్ని స్వయంగా ఆయన సహాయకుడే బైటపెట్టాడు.
- గత ఏడాది మేలో కడప జిల్లా పొట్లదుర్తిలోని సీఎం రమేష్ నివాసంలో కరెంట్ లైన్‌కు ఆటంకం కలిగిస్తున్న కొన్ని చెట్ల కొమ్మలను నరికిన విద్యుత్ లైన్‌మాన్‌ను రమేష్ బూతులు తిడుతూ అతనిపై పాశవికంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రమేష్ దాడిలో తీవ్రగాయాలు పాలైన ఆ లైన్‌మాన్‌ను సహచరులు ఆస్పత్రికి తరలించారు. బాధిత లైన్‌మాన్ రమేష్‌పై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కానీ, రమేష్ తన పరపతిని ఉపయోగించి పోలీసులు, విద్యుత్ సంస్థ అధికారులపై తెచ్చిన వత్తిడి కారణంగా బాధిత లైన్‌మాన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవలసి వచ్చింది.