కోట్లాది రూపాయల ప్రజాధనం నీళ్ళప్రాయంగా ఖర్చు చేసి దావోస్ సదస్సుకు ప్రత్యేక ఆహ్వానం అంటూ…
కోట్లాది రూపాయల ప్రజాధనం నీళ్ళప్రాయంగా ఖర్చు చేసి దావోస్ సదస్సుకు ప్రత్యేక ఆహ్వానం అంటూ ఎంట్రీ టిక్కెట్లు కొనుక్కుని వరసగా నాలుగు సార్లు మందీ మార్బలంతో, ప్రత్యేక విమానంలో వెళ్లి వచ్చిన చంద్రబాబు నాలుగేళ్ళ దావోస్ నాటకం లోగుట్టు ఇది.
* గడచిన నాలుగు (దావోస్) పర్యటనలలో పలు అంతర్జాతీయ కంపెనీలతో వేలాది కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా ప్రచారం చేసిన ఆ కంపెనీల్లో ఒక్కటంటే ఒక్కటైనా ఆంధ్ర ప్రదేశ్‌లో అడుగుపెట్టాయా చంద్రబాబూ?
* 2015 జనవరిలో దావోస్‌లో చంద్రబాబు చేసుకున్నట్లుగా చెప్పుకున్న ఒప్పందాలివి. స్పెయిన్ బుల్లెట్ రైలుపై అధ్యయనం. వాల్‌మార్ట్ ద్వారా డ్వాక్రా ఉత్పత్తులు, పెప్సీకో ద్వారా కోనసీమ కొబ్బరి నీళ్ళ విక్రయం. ఏపీలో ఎయిర్‌బస్ విమానాల తయారీ.
* 2016 దావోస్ పర్యటనలో ఒప్పందాలు. ఏపీలో లాక్‌హీడ్ డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ తయారీ పరిశ్రమ. 2 వేల కోట్లతో మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు. విశాఖపట్నంలో భారీ క్యాంపస్ ఏర్పాటుకు ఇన్ఫోసిస్‌తో ఒప్పందం.
* 2017 దావోస్ సదస్సు ఒప్పందాలు. వేల కోట్ల పెట్టుబడితో సౌదీ ఆరామ్‌కో ఆయిల్ రిఫైనరీ. ఏపీలో వీసా, మాస్టర్ కార్డు ఆపరేషన్స్, హైబ్రీడ్ క్లౌడ్ టెక్నాలజీపై మైక్రోసాఫ్ట్ సంస్థలతో ఒప్పందాలు.
* 2018 దావోస్ ఒప్పందాలు…ఏపీలో హిటాచీ కార్యకలాపాలు. పరిశ్రమల స్థాపనకు ఫ్రాన్ హోఫర్ సంస్థతో ఒప్పందం. 2 వేల ఎకరాల్లో మెడ్‌టెక్ ఇన్నోవేషన్ సెంటర్. అలీబాబా క్లౌడ్ డేటా సెంటర్. వీటిలో ఏ ఒక్కటైనా వచ్చిందా? ఇది దావోస్ నాటకం కాదా?