ఎవరెంత విషం చిమ్మినా – అదరదు బెదరదు మన విశాఖ

ఎవరెంత విషం చిమ్మినా – అదరదు బెదరదు మన విశాఖ – ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరాల్లో ఒకటి.
చుట్టూ పచ్చని కొండలు, సముద్రతీరం , మరోవైపు డాక్ యార్డ్ , సముద్రంలో అలల సవ్వడులు తప్ప అలజడులు, భూకంపాలు చూడని నగరం మన విశాఖపట్నం. ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరాల్లో ఒకటి. అందుకే పెన్షనర్స్ ప్యారడైజ్ అంటారు – అంటే రిటైర్మెంట్ జీవితాన్ని గడపడానికి ఇదో స్వర్గంలాంటిదని. ఈ విషయాలను తర్వాత చూద్దాం… కానీ కొన్ని పత్రికలు, మీడియా మాత్రం సముద్రంలో చీలిక, సునామీల ముప్పంటూ విషం చిమ్ముతూ … భయభ్రాంతులకు గురిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ పప్పులు ఇప్పుడు ఉడకవు. ఎందుకంటే పరిపాలనా రాజధానిగా మారుతుంది – బడుగులు నివసించే ప్రాంతాలు అభివృద్ధి చెందడమేమిటని కొందరు బడాబాబులు కక్షకట్టి ఈ రాతలు రాయిస్తున్నారు. వికేంద్రీకరణ బిల్లు ఆమోదానికి వచ్చినప్పుడే ఇవన్నీ కామన్.
రాష్ట్ర విడిపోయినప్పుడు కూడా ఇవే పత్రికలు, ఛానళ్లు … హైదరాబాద్ భూకంప జోన్ లో ఉంది, మావోయిస్టులు చెలరేగిపోతారు, టెర్రరిజం జెడలు విప్పుతుంది, ఐఎస్ఐ ప్రాబల్యం పెరిగిపోతుంది, అసలు కరెంట్ కూడా ఉండకుండా అంధకారమైపోతుందంటూ చెలరేగిపోయారు. ఏదో ఒక పసలేని వ్యక్తి చెప్పినమాటల్ని అతికించి… అదిగో స్కైలాబ్ పడిపోతుందంటూ భయపెట్టేస్తారు. జనం మెదళ్లలోకి ఎక్కించడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు సముద్రంలో చీలికొచ్చేసిందంట, సునామీలు తుపానులు ఉత్తరాంధ్రను ముంచెత్తుతాయట… ఇంక అంతా అయిపోయిందన్నట్లు 2012 హాలీవుడ్ సినిమాను చూపెట్టేస్తారు. హైదరాబాద్ లో ఎవరో చెప్పారట… దానికి మళ్లీ విశాఖపట్నం డేట్ లైన్. 90ల్లో ఈ ఎల్లో మీడియా ఆటలు సాగాయికానీ… విజ్ఞానం విస్తరించిన ఈ కాలంలో అలాంటి రాతల వెనుకున్న దురుద్దేశాలను ఇట్టే పట్టేయవచ్చు. ఇవన్నీ నడవవు… జనం జోవియల్ గా తీసుకుని కాసేపు నవ్వుకోవడానికి పనికొస్తాయి…
ఒడిశా, బెంగాల్ లాంటి రాష్ట్రాలకు ప్రతిఏటా తుపానులు అతలాకుతలం చేసినా… విశాఖలాంటి నగరాలను తాకింది లేదు. పెట్టనికోటల్లా చుట్టూ ఉండే కొండలు అడ్డుపడుతున్నాయి. తూర్పుకనుమల్లో ఉండే విశాఖ అత్యంత పురాతన క్రటోనిక్ జోన్ లో ఉంది- అంటే అస్సలు భూకంపాలు, సునామీలు వచ్చే ఛాన్సే లేదని ఆంధ్రా యూనివర్సిటీ జియాలజీ డిపార్ట్మెంట్ ఎప్పుడో తేల్చేసింది. దేశంలోని టాప్ ఫైవ్ పరిశుభ్రమైన నగరాల్లో విశాఖ ఒకటి… బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుకూలమైన నేల ఇది. ఇంత సురక్షితం కాబట్టే… ఒక మత్స్యకార గ్రామంగా ఉండే విశాఖ ఇప్పుడు మహానగరంగా ఎదిగింది.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024