డెంగీ, విష జ్వరాలతో విశాఖ, విజయనగరం జిల్లాలు తల్లడిల్లిపోతుంటే…

డెంగీ, విష జ్వరాలతో విశాఖ, విజయనగరం జిల్లాలు తల్లడిల్లిపోతుంటే...

డెంగీ, విష జ్వరాలతో విశాఖ, విజయనగరం జిల్లాలు తల్లడిల్లిపోతుంటే చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధ్యతారాహిత్యం. శోచనీయం. అందరికీ ఆరోగ్యం, ఆనంద ఆంధ్రప్రదేశ్…అంటూ చంద్రబాబు నిర్వహించే కార్యక్రమాలు కేవలం ప్రచారానికి, నినాదాలకు మాత్రమే పరిమితమైపోయాయి.

నెల రోజుల వ్యవధిలో ఒక్క విజయనగరం జిల్లాలోనే డెంగీ, మలేరియా జ్వరాలతో 33 మంది పిట్టలా రాలిపోయారంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ జిల్లాలో ఏజెన్సీతోపాటు నర్సీపట్నం, చోడవరం, అనకాపల్లి ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. చంద్రబాబు సర్కారు తక్షణమే మేల్కొని ఈ రెండు జిల్లాల్లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి.