భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ టెండర్ లో పాల్గొనకుండా…

భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ టెండర్ లో పాల్గొనకుండా...

భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ టెండర్ లో పాల్గొనకుండా ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను నిషేధించి కేవలం ప్రైవేట్ సంస్థలను మాత్రమే టెండర్ కు అర్హులను చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక భారీ దోపిడీకి పథక రచన జరిగింది.

గతంలో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఈ టెండర్ ను దక్కించుకోవడంతో కుంటి సాకులు చూపుతూ చంద్రబాబు దానిని రద్దు చేశారు. తాజాగా జారీ చేసిన టెండర్ లో అసలు ఎయిర్ పోర్ట్ అథారిటీ పాల్గొనకుండా నిషేధించడం ఏమైనా సహేతుకమైన చర్యేనా?

ప్రైవేట్ కంపెనీలైతే వారితో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా దోచుకోవచ్చు. ఎయిర్ పోర్ట్స్ అధారిటీ అయితే ఈ దోపిడీ సాధ్యం కాదని తెలిసే చంద్రబాబు బరితెగించి అందుకు స్కెచ్ వేశారు. కాదని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అన్నదే నా ప్రశ్న.