రాంబిల్లి నేవల్ బేస్ నిర్వాసితుల సమస్యలపై రక్షణ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తో భేటీ.

రాంబిల్లి నేవల్ బేస్ నిర్వాసితుల సమస్యలపై రక్షణ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తో భేటీ.

రాంబిల్లి నేవల్ బేస్ నిర్వాసితుల సమస్యలపై రక్షణ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తో భేటీ.
—————————————————————————————————-

విశాఖ జిల్లా రాంబిల్లి మండలంలో విశాఖ నేవల్ ఆల్టర్నేట్ ఆపరేషన్స్ బేస్ నిర్వాసితుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ విశాఖపట్నంకు చెందిన పార్టీ ప్రతినిధులతో కలిసి గురువారం ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్తో భేటీ కావడం జరిగింది.

పదేళ్ళ కిందట నేవల్ బేస్ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా రాంబిల్లి మండలంలోని పలు తీర ప్రాంత గ్రామాలలో ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. భూసేకరణ జరిపిన గ్రామాలలో మత్స్యకారుల గ్రామాలు అనేకం ఉన్నాయి. అప్పట్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్ట పరిహారంతోపాటు సహాయ, పునరావాస చర్యలలో భాగంగా అనేక వసతులు, సౌకర్యాలు కల్పించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ అంగీకరించింది.

కానీ ఇప్పటి వరకు నిర్వాసితులు ఎన్ని ఆందోళనలు, విజ్ఞాపనలు చేస్తున్నా సహాయ, పునరావాస కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. ఇప్పటికైనా చొరవ చూపించి ఆయా గ్రామాలకు చెందిన నిర్వాసితులకు న్యాయం చేయవలసిందిగా రక్షణ శాఖ మంత్రి శ్రీమతి సీతారామన్కు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ విషయంలో సాధ్యమైనంత త్వరగా నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.