ఆ మూడు పార్టీలు డ్రామాలాడుతున్నాయి

ఆ మూడు పార్టీలు డ్రామాలాడుతున్నాయి
Sakshi | Updated: July 22, 2016 18:41 (IST)
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శించారు. రాజ్యసభలో ఆ మూడు పార్టీలు కుమ్మక్కై ప్రత్యేక హోదా బిల్లు ఓటింగ్కు రాకుండా చేశాయని అన్నారు. బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సభ్యులే పోడియం వద్దకు వెళ్లి సభను అడ్డుకోవడం దురదృష్టకరమని చెప్పారు.

సమస్యను పొడగించి లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని విజయసాయి రెడ్డి విమర్శించారు. రెండేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పార్టీ వైఎస్ఆర్ సీపీ ఒక్కటేనని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి తమ పోరాటాన్ని కొనసాగిస్తామని విజయసాయి రెడ్డి చెప్పారు. రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *