‘తొలి ఐదు సంతకాలను అభాసుపాలు చేశారు’

'తొలి ఐదు సంతకాలను అభాసుపాలు చేశారు'

Sakshi | Updated: May 25, 2015 17:30 (IST)

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి విజయసాయి రెడ్డి మండిపడ్డారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీల వర్షం కురిపించి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు..  అనంతరం అధికారం చేపట్టాక తొలి ఐదు సంతకాలను కూడా అభాసుపాలు చేశారని విమర్శించారు. సంతకాలను అభాసుపాలు చేసిన ఘనత మాత్రం చంద్రబాబుకే దక్కుంతుందని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.  సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన..  రుణమాఫీ పేరుతలో రైతులను నిలువునా మోసం చేశారన్నారు. అబద్ధాలు చెప్పి మభ్యపెట్టడంలో చంద్రబాబు గిన్నిస్ రికార్డు ఎక్కుతారన్నారు.

రాజధాని మాస్టర్ ప్లాన్ ఒప్పందం ద్వారా వచ్చిన ముడుపులతో ఆయన సింగపూర్ లో మరో హోటల్ నిర్మించుకుంటున్నారన్నారు. పోలీసులను ఉపయోగించి ప్రతిపక్షాన్ని ఎలా అణగతొక్కాలో మినీ మహానాడులో చర్చించుకోవడం దారణమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు జూన 3,4 వతేదీల్లో వైఎస్సార్ సీపీ సమరదీక్షకు సిద్ధమవుతున్నట్లు విజయసాయి రెడ్డి స్పష్ట చేశారు.


Recommended Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *