విశాఖలో 20వ అంతర్జాతీయ సీ ఫుడ్ షో

విశాఖలో 20వ అంతర్జాతీయ సీ ఫుడ్ షో
Sakshi | Updated: July 27, 2016 19:02 (IST)

సాక్షి, న్యూఢిల్లీ :

సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు విశాఖలో భారత 20వ అంతర్జాతీయ సీ ఫుడ్ షో నిర్వహిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. విశాఖపట్టణం పోర్టు నుంచి 2013-14 ఏడాదిలో రూ. 6,825 కోట్ల విలువైన సముద్రపు ఉత్పత్తులను ఎగుమతి చేసినట్టు కేంద్రం తెలిపింది. అలాగే 2014-15 ఏడాదిలో రూ. 7,578 కోట్లు, 2015-16 ఏడాదిలో రూ. 7,161 విలువైన సముద్రపు ఉత్పత్తులను ఎగుమతి చేసినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం చెప్పింది.

టౌన్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్ ఎక్సలె న్స్ మిషన్‌లో భాగంగా విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో మౌలిక సదుపాయల కల్పన చేపడుతున్నట్టు వెల్లడించింది. సముద్రపు ఉత్పత్తులు ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపీఈడీఏ) ఇప్పటికే విశాఖలో వన్నామై రొయ్యల సంతానోత్పత్తి కేంద్రాన్ని నడుపుతోందని పేర్కొంది. అలాగే బంగారంపేటలో రొయ్యల సంతానోత్పత్తి కేంద్రం, ఆక్వాటిక్ క్వారన్‌టైన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి ఎంపీఈడీఏ ఇప్పటికే సమగ్ర నివేదికను తయారు చేసిందని తెలిపింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *