‘ఏపీలో దోచిన డబ్బంతా.. ఎన్నికల్లో ఖర్చు’

‘ఏపీలో దోచిన డబ్బంతా.. ఎన్నికల్లో ఖర్చు’

‘ఏపీలో దోచిన డబ్బంతా.. ఎన్నికల్లో ఖర్చు’

YSRCP MP Fires on TDP - Sakshi

సాక్షి, విశాఖపట్నం : టీడీపీ, కాంగ్రెస్‌ల డీల్‌ ఏంటో ప్రజలు తెలుసుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. గత కర్ణాటక ఎన్నికల్లోనూ టూరిస్టుల బస్సుల్లో డబ్బును టీడీపీ తరలించిందన్నారు. కాంగ్రెస్‌ ప్రకటనల్లో చంద్రబాబు ఫోటో పెద్దదిగా వేస్తున్నారని, తెలంగాణ ఎన్నికలకు రూ.1200 కోట్లు చంద్రబాబు తరలించారని మండిపడ్డారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికలకు కూడా చంద్రబాబు రూ.500 కోట్లు పంపారని ధ్వజమెత్తారు. నంద్యాల ఎన్నికల్లో ఒక్కో ఓటుకు టీడీపీ రూ.5 వేలు ఖర్చుపెట్టిందన్నారు. ఏపీలో దోచిన డబ్బంతా ఎన్నికల్లో ఖర్చుపెడుతున్నారని నిప్పులు చెరిగారు.

‘ఇదంతా చూస్తే రాష్ట్రాన్ని బాబు ఎలా దోచుకున్నారో అ​ర్థం అవుతోంది. ఏ రోజు ఎంత డబ్బు తరలిస్తారు, ఎక్కడ దాస్తున్నారో వివరిస్తా. ప్రజలారా .. అదంతా మీ సొమ్ము, మీరెలా తీసుకుంటారో మీ ఇష్టం. అవినీతితో చంద్రబాబు హిమాలయ అంచులకు వెళ్లారు. నీతిమంతుడిని, సీనియర్‌ అని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. నాలుగేళ్లుగా విజయవాడలో ఒక బ్రిడ్జి కట్టలేని వ్యక్తి చంద్రబాబు. తెలంగాణలో తానే అభివృద్ధి చేశాడని బాబు గొప్పలు చెబుతున్నారు. 2013లో అవినీతి పరులు కాంగ్రెస్‌లో చేరుతారని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే కాంగ్రెస్‌లోనే చేరిపోయారు. చంద్రబాబువి నీచ రాజకీయాలు. జనసేన కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతోంది.

ఒక్కసారి వైఎస్‌ జగన్‌కు అవకాశం ఇవ్వండి. 30 ఏళ్ల సంక్షేమంతో రాష్ట్రం ముందుకెళ్తుంది. దళితులు, ఎస్సీలు, ఎస్టీలకు న్యాయం చేసేది వైఎస్సార్‌సీపీనే. దళితుల హక్కుల కోసం వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది. తెలంగాణలో మీ మనస్సాక్షిగా ఓటు వేయండి. దేశంలో టీడీపీ ఎక్కడ పోటీ చేసినా బుద్ధి చెప్పండి. ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు అనేక సార్లు యూటర్న్‌ తీసుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు రెండు ఏపీకి ద్రోహం చేశాయి. కాంగ్రెస్‌, బీజేపీల హామీలను నమ్మడం లేదు. 25కు 25 ఎంపీ స్థానాలను వైఎస్సార్‌సీపీకి ఇవ్వండి. ఏపీకి హోదాపై సంతకం పెట్టిన పార్టీకి మద్దతిస్తాం. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారు. ఏపీ ప్రజలను విడగొట్టి అన్యాయం చేసింది కాంగ్రెస్‌. ఇప్పుడు టీడీపీని అదే కాంగ్రెస్‌కు చంద్రబాబు దగ్గరగా చేర్చారు’అని విజయసాయి రెడ్డి తెలిపారు.


Recommended Posts