YSRCP Mega Job Mela, Kadapa
తన హయాంలో ఒక్క ఉద్యోగం కల్పించలేని చంద్రబాబు.. లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తున్న జగన్ గారి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు. దేశ చరిత్రలోనే సుమారు 60 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసి ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిన ఘనత చంద్రబాబుది. అందుకే ఆయన అభినవ పులకేసి.
మూడేళ్లలోనే 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం శ్రీ వైఎస్ జగన్ గారిది. వచ్చే రెండేళ్లలోనూ మరిన్ని ఉద్యోగాలను జగన్ గారి ప్రభుత్వం కల్పిస్తుంది. జగన్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రానికి అనేక పరిశ్రమలను తీసుకొచ్చారు. అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు.
వైఎస్సార్ సీపీ ఇప్పటివరకు నిర్వహించిన మూడు జాబ్ మేళాల్లో 40 వేల ఉద్యోగాలు కల్పించాం. రేపు కడపలో జరగబోయే జాబ్ మేళాలోనూ వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఉద్యోగార్థులందరూ ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.