పాకిస్తాన్‌ చెరలో ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు…

పాకిస్తాన్‌ చెరలో ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు...

పాకిస్తాన్‌ చెరలో ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీ ఎంపీల బృందం విదేశాంగ మంత్రి శ్రీ ఎస్‌.జయశంకర్‌కు విజ్ఞప్తి చేసింది. నాతోపాటు పార్టీ లోక్‌సభా పక్ష నేత శ్రీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ బాధిత మత్స్యకార కుటుంబ సభ్యులతో కలిసి పార్లమెంట్‌లోని మంత్రి కార్యాలయంలో ఆయనను కలుసుకోవడం జరిగింది.