in media on 9 September 2018

in media on 9 September 2018

విశాఖపట్నం కంచరపాలెం మెట్టు వద్ద ఆదివారం శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ప్రసంగించబోయే బహిరంగ సభా స్థలి వద్ద ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా మీడియాను ఉద్ధేశించి మాట్లాడటం జరిగింది.

చరిత్రలో నిలిచిపోయే సభ

Vijaya Sai Reddy Says Vizag Meeting Creating History - Sakshi

సాక్షి, విశాఖపట్నం : వైస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విశాఖ నగరానికి చేరిన సందర్భంగా కంచరపాలెంలో నిర్వహించే సభ చరిత్రలో నిలిచిపోతుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్‌ పాదయాత్ర సందర్భంగా విశాఖనగరం జన సంద్రోహమైందని ఆయన తెలిపారు. చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడికి రాని జనం వైఎస్‌ జగన్‌ సభకు తరలివచ్చారని అన్నారు. గత ఎన్నికల్లో వైస్సార్‌సీపీకి ఎందుకు ఓటు వేయ్యలేదని ప్రజలు ఇప్పడు బాధపడుతున్నారని.. రానున్న ఎన్నికల్లో విశాఖ ప్రజలు తప్పకుండా వైఎస్‌ జగన్‌ పక్షాన నిలబడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి ఆర్థిక రాజధాని అయిన విశాఖను జగన్‌ మాత్రమే అభివృద్ధి చేయగలరని ఆయన తెలిపారు. ప్రజలందరూ కూడా అదే అభిప్రాయంతో ఈ సభకు తరలివచ్చారని అన్నారు. అధికార టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు విశాఖలో విలువైన భూముల కబ్జా చేశారని.. అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. విశాఖ నగరానికి ఎంతో ముఖ్యమైన రైల్వే జోన్‌పై కేంద్రంతో అలుపెరగని పోరాడం చేశామని ఆయన గుర్తుచేశారు.


Recommended Posts