రాజన్న రాజ్యం రావాలి : గణనాథుడికి ప్రత్యేక పూజలు

రాజన్న రాజ్యం రావాలి : గణనాథుడికి ప్రత్యేక పూజలు

రాజన్న రాజ్యం రావాలి : గణనాథుడికి ప్రత్యేక పూజలు

Vinayaka Chavithi Celebrations in Lotus Pond - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లోటస్‌ పాండ్‌లో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు విజయ సాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బత్తుల బ్రహ్మానంద రెడ్డి హాజరై వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే వినాయక చవితి నాటికి ఏపీలో ప్రజలు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోవాలని, రాజన్న పాలన రావాలని, ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నట్టు పార్టీ రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి తెలిపారు. గణేష్‌ ఉత్సవాలు ప్రజలందరిలో ఐక్యమత్యం పెంచుతాయని అన్నారు మండలి విపక్ష నేత ఉమ్మారెడ్డి.

‘వైఎస్సార్‌సీపీ విజయానికి ప్రధమ మెట్టుగా భావిస్తూ.. 2019 జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి, పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌ రెడ్డికి రాజ్యాధికారి సిద్ధిస్తుంది. ముఖ్యమంత్రి అవుతారనే విశ్వాసంతో ఈ రోజు వినాయక చవితిని పండుగగా జరుపుకున్నాం. రాష్ట్ర ప్రజలందరూ సుఖ శాంతులతో కలకాలం వర్థిల్లాలి. రాష్ట్రం మంచిగా అభివృద్ధి చెందాలనే భావనతో ఈ పండుగను చేసుకోవడం జరిగింది’ అని విజయ సాయి రెడ్డి తెలిపారు.

రాష్ట్ర ప్రజానీకం అంతా కోరుకునేది కూడా ఈ నాడు ఉన్న ప్రభుత్వం పోయి, రాజన్న రాజ్యం రావాలని, జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వార్లు చెప్పారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా తప్పకుడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని, జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రాప్రజానీకం సుభిక్షంగా ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్టు తెలిపారు. రాజశేఖర్‌ రెడ్డి మొదలు పెట్టిన పోలవరం ప్రాజెక్ట్‌ దగ్గర్నుంచి, 87 జలయజ్ఞాలు ప్రాజెక్టులు కూడా రాబోయే సంవత్సరంలో అధికారంలోకి రాగానే తప్పకుండా పూర్తిచేయాలి. రైతాంగం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాల వారు ఎటువంటి ఆటంకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని నేడు పార్టీ ఆఫీసులో పూజ చేశామని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు.