‘భవన నిర్మాణ’ చట్టాన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందే

‘భవన నిర్మాణ’ చట్టాన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందే

Sakshi | Updated: November 18, 2016 01:27 (IST)

ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ సమాధానం

 సాక్షి , న్యూఢిల్లీ: భవన నిర్మాణ కార్మికుల చట్టాన్ని(1996) కచ్చి తంగా అమలు చేసి తీరాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రాజ్యసభలో వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం ఈ చట్టం ప్రకారం రూ.1,153.61 కోట్లు వసూలు చేసిందని.. కానీ ఇందులో 15 లక్షల మంది కార్మికుల సంక్షేమం కోసం కేవలం రూ.205.46 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టింద ని, దీనిపై కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుం దని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసా రుురెడ్డి ప్రశ్నించారు. దీనికి మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ఈ విషయం వాస్తవమేనని.. చట్టం ప్రకారం ఈ సెస్‌ను వసూలు చేసే పరిధి రాష్ట్ర ప్రభుత్వాలదేనని.. అలాగే ఈ మొత్తాన్ని కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయా ల్సింది కూడా రాష్ట్రాలేనన్నారు. రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుల ద్వారా వీటిని సద్వినియోగం చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా, విశాఖపట్నం జిల్లాకు జాతీయ బాల కార్మికుల ప్రాజెక్టు (ఎన్‌సీఎల్‌పీ)ను ఇప్పటికే మంజూరు చేసినట్లు విజయసారుురెడ్డి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ సమాధానమిచ్చారు.


Recommended Posts