మద్య నిషేధంతో ఏం జరుగుతుందో వివరించిన విజయ సాయిరెడ్డి

మద్య నిషేధంతో ఏం జరుగుతుందో వివరించిన విజయ సాయిరెడ్డి

Teluguglobal  3 Nov, 2016

రాష్ట్రంలో మద్యపాన నిషేధం కోసం ప్రతి మహిళాపోరాటం చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. మద్యపాన నిషేధం వల్ల ఆదాయం తగ్గిపోయి అభివృద్ధి ఆగిపోతుందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మద్యపాన నిషేధం వల్ల అభివృద్ధికి ఎలాంటి ఆటంకం ఉండదన్నారు. ఇటీవల “ఏషియన్ డెవలప్‌మెంట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌” విడుదల చేసిన రిపోర్టు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. ఒక ఇంటి పెద్ద రోజుకు 300 రూపాయలు సంపాదిస్తుంటే అందులో 150 రూపాయలు మద్యానికి ఖర్చు చేస్తున్నారని వివరించారు. అదే 150 రూపాయలతో ఇతర వస్తువులు కొంటే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్నారు. అభివృద్ధి కూడా రెట్టింపు అవుతుందన్నారు.

అంతేకాకుండా మనుషుల ఆరోగ్యం పాడవకుండా రాష్ట్రంలోని కుటుంబాలన్నీ సుభిక్షంగా ఉంటాయన్నారు. ఎన్టీఆర్ మద్యపానాన్ని నిషేధిస్తే ఆదాయం తగ్గిపోతుందని ప్రచారం చేసి తిరిగి మద్యాన్ని తీసుకొచ్చారని విజయసాయిరెడ్డి విమర్శించారు. కాబట్టి మద్య నిషేధం వల్ల అభివృద్ధికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదని… కాబట్టి ప్రతి మహిళా మద్యనిషేధం కోసం పోరాటం చేయాలన్నారు. ఇందుకు వైసీపీ కూడా మద్దతుగా ఉంటుందన్నారు.


Recommended Posts