అన్నిసార్లూ మోసం చేయలేరు చంద్రబాబూ..

అన్నిసార్లూ మోసం చేయలేరు చంద్రబాబూ..

అన్నిసార్లూ మోసం చేయలేరు చంద్రబాబూ..

Vijayasai Reddy Tweet on Chandrababu - Sakshi

విజయసాయిరెడ్డి ట్వీట్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలందరినీ ఒకసారి మోసం చేయవచ్చుగానీ.. అన్నిసార్లూ మోసం చేయలేరని సీఎం చంద్రబాబునాయుడును ఉద్దేశించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిమంగళవారం ట్వీట్‌ చేశారు. నిజం ఎప్పటికైనా ప్రజలు తెలుసుకుంటారన్నారు. చంద్రబాబు అంటే అన్ని వర్గాల వ్యతిరేకి, అత్యంత అవినీతిపరుడు అని వ్యాఖ్యానించారు. ‘‘మీరు అన్ని వేళల్లోనూ కొంతమందిని మోసం చేయవచ్చు. మీరు అందరినీ ఒకసారి మోసం చేయవచ్చు. అయితే ప్రజలందరినీ అన్నిసార్లూ మోసం చేయలేరు. ప్రజలకు నిజం ఏమిటో తెలిసిపోతుంది.. చంద్రబాబు అంటే విద్రోహి, అంతులేని అవినీతిపరుడు, అత్యంత అసమర్థుడు, అబద్ధపు హామీలకు చిరునామా, యూటర్న్‌లు తీసుకోవడంలో మాస్టర్, వెన్నుపోటుదారుడు, నిరుపేదల బద్ధ వ్యతిరేకి, మైనారిటీలకు వ్యతిరేకి, రైతుల వ్యతిరేకి’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేస్తూ ఇందుకు సంబంధించిన వీడియోను జత చేశారు.

ప్రజారోగ్య శాఖ యంత్రాంగం దిగజారిపోవడమేమిటి? 
‘‘టీడీపీ ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణ కింద పనిచేస్తున్న ఏపీఎస్‌ఏసీ అధికారులు తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రోగులను మందులు బయటినుంచి కొనుగోలు చేసుకోవాల్సిందిగా సూచించడం సిగ్గుచేటు. కొత్తగా జన్మించిన శిశువులకూ ఈ బాధ తప్పట్లేదు. పలు వ్యాధుల నుంచి ఈ చిన్నారులను కాపాడే ‘నెవిరపైన్‌’ సిరప్‌ను కూడా వారికి ఇవ్వట్లేదు. రాష్ట్రంలో ప్రజారోగ్య యంత్రాంగం అథమస్థాయికి దిగజారిపోయింది. హెచ్‌ఐవీ రోగులకు, చిన్న పిల్లలకు మందులే లభించడం లేదు. ఏమిటిది చంద్రబాబూ?’’ అని కూడా సాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

చెరకు రైతులను ఆదుకునే చర్యలేవి? 
‘‘రాష్ట్రంలో చెరకు సాగు 1.75 లక్షల హెక్టార్ల నుంచి 90,000 హెక్టార్లకు పడిపోవడం వల్ల చెరకు రైతులంతా చాలా సంక్షోభంలో ఉన్నారు. సాగు వ్యయాన్ని నియంత్రించడంలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యం, ధరల్లో ఒడుదుడుకుల కారణంగా వారికి తక్కువ ప్రతిఫలం లభిస్తోంది. అయినా వారిని ఆదుకోవడానికి చంద్రబాబుప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదు’’ అని మరో ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.


Recommended Posts