చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Jul 19, 2018, 14:12 IST

సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఫోర్త్ జెండర్ అని, ప్రకృతిలో ఆయన ఎటూకాని వ్యక్తి అని విమర్శించారు. చంద్రబాబు ఏపీకి సీఎంగా ఉంటూ ఫోర్త్ జెండర్‌గా ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాలానికి తగ్గట్లుగా చంద్రబాబు రంగులు మారుస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు ఓవైపు బీజేపీతో రహస్య ఒప్పందం కొనసాగిస్తూనే.. మరోవైపు అవిశ్వాస తీర్మానాన్ని పెడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అవిశ్వాసం పెట్టినప్పుడు దానివల్ల ఏం ప్రయోజనమని ప్రశ్నించిన చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్ తీసుకుని అదే పని చేస్తున్నారని విరుచుకుపడ్డారు. వైఎస్సార్ సీపీ ఏపీకి ప్రత్యేక హోదా కోరుకుంటోందని, ఏపీకి న్యాయం జరిగేందుకు ఏ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినా మద్దతు ఇస్తామని గతంలోనే చెప్పామని గుర్తుచేశారు.
Recommended Posts

In media on 3 June 2024
03/06/2024

In media on 14 May 2024
14/05/2024

In media on 12 May 2024
12/05/2024