హామీలన్నీ నెరవేర్చామన్న ‘పప్పు’ను పిచ్చాసుపత్రిలో చేర్చాలి
హామీలన్నీ నెరవేర్చామన్న ‘పప్పు’ను పిచ్చాసుపత్రిలో చేర్చాలి
Sep 12, 2018, 04:07 IST
వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
సాక్షి, అమరావతి: టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు వందకు 100% అమలు చేశామని ప్రకటించిన మంత్రి లోకేశ్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ‘టీడీపీ మేనిఫెస్టోను 100కు 100% అమలు చేశామని లోకేశ్‌నాయుడు ఈ రోజు చెప్పారు.
ఈ ప్రకటన చేసిన పప్పు నాయుడిని పిచ్చాసుపత్రిలో చేర్చాలి. కార్నెగీ, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాలు లోకేశ్‌కు ఇచ్చిన డిగ్రీలను రద్దు చేయాలి. లేదంటే ఆ యూనివర్సిటీల పరువు పోతుంది’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Recommended Posts
In media on 3 June 2024
03/06/2024
In media on 14 May 2024
14/05/2024
In media on 12 May 2024
12/05/2024