రాజ్యసభ రూల్స్‌ కమిటీ సభ్యుడిగా విజయసాయి రెడ్డి

రాజ్యసభ రూల్స్‌ కమిటీ సభ్యుడిగా విజయసాయి రెడ్డి

వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని రాజ్యసభ రూల్స్‌ కమిటి సభ్యుడిగా రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీ గత శుక్రవారం నాడు నామినేట్‌ చేశారు. రాజ్యసభ రూల్స్‌ కమిటికి హమీద్‌ అన్సారీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ హోదాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయసాయిరెడ్డితో పాటు తమిళనాడుకు చెందిన డిఎమ్‌కే ఎంపీ తిరుచి శివ, సమాజ్‌వాది పార్టీ రాజ్యసభ సభ్యుడు రమణ్‌ సింగ్‌, ఇండిపెండెంట్‌ సభ్యుడు డాక్టర్‌ సుభాష్‌ చంద్రలను ఈ కమిటీలో సభ్యులుగా చైర్మన్‌ అన్సారీ నామినేట్‌ చేశారు.