అండగా ఉంటాం.. ఆందోళన వద్దు

అండగా ఉంటాం.. ఆందోళన వద్దు

అండగా ఉంటాం.. ఆందోళన వద్దు

Vijay Sai Reddy Support To Fishermens Families - Sakshiవిజయసాయిరెడ్డికి బొకే అందిస్తున్న చిన్నా, కె.కె.రాజు

శ్రీకాకుళం మత్స్యకారులకు ఎంపీ విజయసాయిరెడ్డి భరోసా

పాక్‌లో చిక్కుకున్న వారి కుటుంబసభ్యులకు ఊరట

విశాఖ: మా కుటుంబాలకు కంటిమీద కును కు లేదు.. గుజరాత్‌ రాష్ట్రంలో పోరుబందర్‌ తీరానికి బోట్ల మీద చేపలు వేటకు వెళ్లిన మా వాళ్లను పాకిస్తాన్‌ కోస్టుగార్డులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి మాకు దిక్కుతోచడం లేదు.. అంటూ మత్స్యకారులు రాజ్యసభ సభ్యుడు ఎం.విజయసాయిరెడ్డి ఎదుట తమ ఆవేదనను వెల్లబుచ్చుకున్నారు. విదేశాంగ మంత్రితో మాట్లాడి న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనికి చలించిన ఎంపీ మాట్లాడుతూ బందీలుగా ఉన్న వారిని క్షేమంగా తీసుకురావడానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

ఇదీ పరిస్థితి
నవంబర్‌ 28న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్య్సలేశం, కె.మత్య్సలేశం, శివాజీ దిబ్బపాలెం,బడివానిపేట గ్రామాలకు చెందిన మత్స్యకారులు వేటకు వెళ్లారు. వీరిని అక్కడ సరిహద్దులో పాకిస్తాన్‌ కోస్టుగార్డు వారు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బాధిత కుటుంబాలు మత్స్యకార నాయకుల ఆధ్వర్యంలో సోమవారం సీతమ్మధార  బాలయ్యశాస్త్రి లేఅవుట్‌లోని రాజ్యసభసభ్యుడు, వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డిని కలిసి కన్నీరు మున్నీరయ్యారు. నాలుగు బోట్లు కలిసి చేపల వేటచేస్తుండగా  మూడు బోట్లకు చెందిన 21 మంది పాకిస్తాన్‌ కోస్టుగార్డుకు చిక్కారని వివరించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్య్సలేశం గ్రామానికి చెందిన ఐదుగురు, కొత్త మత్య్సలేశంకు చెందిన ముగ్గురు,  బడివానిపేటకు చెందిన ముగ్గురు, శివాజీ దిబ్బపాలేనికి చెందిన ఒకరు ఉన్నారని వివరించారు.విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామానికి చెందిన  ఐదుగురు, ఎచ్చెర్ల మండలం తోటపాలెం గ్రామానిక చెందిన ఒకరు, శ్రీకాకుళం పట్టణం దుమ్మలవీధికి చెందిన ఒకరు, కాకినాడకు చెందిన ఇద్దరు ఉన్నారని పేర్కొన్నారు.

తామంతా కుటుంబ సభ్యులు వేటకు వెళ్లి తెచ్చిన ఆదాయంతోనే జీవిస్తున్నామన్నారు. మా పెద్ద దిక్కులు  పాకిస్తాన్‌ కోస్టుగార్డులకు దొరికి పోవడంతో మేం ఆందోళనకు గురవుతున్నాము. ఆర్థి కంగా కూడా ఇబ్బంది పడుతున్నాం.. మా కు టుంబ సభ్యులను దేవానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన  ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మీ కు టుంబాలు వచ్చే విధంగా కేంద్ర విదేశాంగ మంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఐదుగురిని తనతో పాటు కేంద్రమంత్రి వద్ద కు తీసుకువెళ్లి వినతిపత్రం అందించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో పూసపాటిరేగ మండలం తిప్పలవసలకు చెందిన బర్రి భవిరేడు, నక్కఅప్పన్న, నక్కనర్సింగ్,నక్క ధనరాజ్, మాజీ వైస్‌ ఎంపీపీ మైలపల్లి నర్శింహలు, ముక్కాం మాజీ సర్పంచ్‌ మైలపల్లి అప్పలకొండ, మైలపల్లి గురువులు, సీఈసీ మెంబర్‌ కాకర్లపూడి శ్రీనివాస్‌రాజు, పతివాడ అప్పలనాయుడు, భోగాపురం మండల కన్వీనర్‌ ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి,వాసుపల్లి అప్పలరాజు, మూగి శ్రీరాములు, మూడి రాము,  సూరాడ అప్పారావు, మూగి గురుమూర్తి,  కామేష్, బర్రి లక్ష్మణ ఎం.రామారావు, ఎం.గురుమూర్తి పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ విశాఖ పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌ జనరల్‌ సెక్రటరీగా తనను నియమించిన సందర్భంగా కె.చిన్నా సోమవారం రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పూలబొకే ఇచ్చి, శాలువాతో సత్కరించారు.కార్యక్రమంలో పార్టీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు పాల్గొన్నారు.


Recommended Posts