వైఎస్‌ జగన్‌ను సీఎం చేయాల్సిందే: విజయసాయి రెడ్డి

వైఎస్‌ జగన్‌ను సీఎం చేయాల్సిందే: విజయసాయి రెడ్డి

వైఎస్‌ జగన్‌ను సీఎం చేయాల్సిందే: విజయసాయి రెడ్డి
Jul 01, 2018, 20:32 IST

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే ప్రతి పక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన పుట్టిన రోజు కావడంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున్న శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషెస్‌కు విజయసాయిరెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ.. ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులు, నా శ్రేయోభిలాషులు, పార్టీ నేతలు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ఈ ఏడాది మనకు చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్‌ పురోగతి సాధించాలంటే జననేత వైఎస్‌ జగన్‌ సీఎం కావాల్సిందే. మన శాయశక్తుల కృషి చేసి మన ఈ కలను సాకారం చేసుకుందాం’ అని ట్వీట్‌ చేస్తూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

త్వరలోనే బుక్‌ రిలీజ్‌..
వెంకటేశ్వర స్వామి చరిత్రపై ఆయన స్వయంగా రాసిన పుస్తకాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలతో నా పుస్తకాన్ని ‘గ్లోరీ ఆఫ్‌ లార్డ్‌ వెంకటేశ్వర’ అనే టైటిల్‌తో తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, గుజరాతీ భాషల్లో త్వరలోనే విడుదల చేస్తాం. ఈ పుస్తకం వెంకటేశ్వరుడి వైభవం, నివాసం, ఆచారాలు, సాంప్రదాయాలను తెలియజేస్తోంది’ అని ట్వీట్‌ చేశారు.

 


Recommended Posts