ఉప్పొంగిన జనసంద్రం!

ఉప్పొంగిన జనసంద్రం!

ఉప్పొంగిన జనసంద్రం! విశాఖపట్నంలో ఆదివారం శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని. కంచరపాలెం వద్ద జరిగిన ఈ సభకు ఇసుక వేస్తే రాలనంతగా ప్రజలు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు నగరం నలుమూలల నుంచి తరలి రావడంతో సభా వేదికకు అరకిలోమీటరు దూరం జన సంద్రాన్ని తలపించింది. మధ్యాహ్నం నుంచి నగరంలో అన్ని ప్రధాన రహదారులు సభకు వచ్చే జనంతో కిక్కిరిసిపోవడంతో అనేక రహదారులపై పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. విశాఖలో ఇంత భారీ సభ జరగడం చారిత్రాత్మకం. అపూర్వం!