చంద్రబాబు మిమ్మల్ని అలా పిలుస్తాం.. సరేనా?

చంద్రబాబు మిమ్మల్ని అలా పిలుస్తాం.. సరేనా?
Nov 04, 2018, 12:57 IST

సాక్షి, హైదరాబాద్ : ‘సీఎం చంద్రబాబు నాయుడిని శునకానంద నాయుడుగా పిలుస్తాం.. సరేనా?’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ట్విటర్ వేదికగా #NaraCongressBabuNaidu #itrides హాష్ ట్యాగ్స్‌తో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ‘తమ పార్టీని కోడి కత్తి పార్టీ అంటూ దిగజారి శునకానందం పొందుతున్నారు. కాబట్టి, ఇక మీదట మీ పార్టీని శునకానందం పార్టీగా పిలుస్తాం. మిమ్మల్ని శునకానంద నాయుడుగా పిలుస్తాం సరేనా?’ అని ప్రశ్నించారు.
ఇక మరో ట్వీట్‌లో.. ఐటీ సోదాల నుంచి రక్షణ పొందేందుకే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తిరుగుతున్నాడని, జాతీయ స్థాయి లీడర్‌నంటూ ఐటీ శాఖను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. అక్రమసంపాదన కేసుల్లో చిక్కుకున్న చిదంబరం, రాబర్ట్ వాద్రాలనే రాహుల్ కాపాడలేకపోయారని, ఇక నిన్నేం కాపాడతారని ఎద్దేవా చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)లు, కమిషన్‌లు చంద్రబాబు చెప్పినట్లుగా నివేదికలు ఇచ్చే వ్యవస్థలన్న విషయం బహిరంగ రహస్యమన్నారు. అవి బాబు ‘సిట్’అంటే కూర్చుని,‘స్టాండ్’అంటే నిలబడి తమ వీరవిధేయతను ప్రకటిస్తాయని విమర్శించారు. సీఎంగా 14ఏళ్ళ హయాంలో బాబు వేసిన సిట్‌లు, విచారణలు ఉత్తిత్తివే అన్నది చారిత్రక సత్యమని పేర్కొన్నారు.
Recommended Posts
Platin Casino No Deposit Bonus
05/02/2025
Pokern – Texas Hold’em Regeln
03/10/2024

