తీర్మానాలు ఎప్పుడు వెనక్కి తీసుకుంటారు బాబూ?

తీర్మానాలు ఎప్పుడు వెనక్కి తీసుకుంటారు బాబూ?
Jul 24, 2018, 03:48 IST

వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, నూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చంద్రబాబు చేసిన తీర్మానాలను ఎప్పుడు వెనక్కి తీసుకుంటారని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన పార్లమెంటు వద్ద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. ‘ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నాలుగేళ్లపాటు టీడీపీ ఎంపీలు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి కేంద్ర మంత్రి మండలిలో ఉండి కేంద్రం తీసుకున్న అన్ని నిర్ణయాలకు మద్దతు పలికారు.
ప్యాకేజీని స్వాగతిస్తూ చంద్రబాబు 2016, సెప్టెంబర్ 9న అసెంబ్లీలో, 2017, మార్చి 16న శాసనమండలిలో కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు చేశారు. ఇప్పుడు ఆయన హోదా విషయంలో పలు యూటర్న్లు తీసుకున్నారు. అందువల్ల కేంద్రానికి పంపిన తీర్మానాలను ఎప్పుడు ఉపసంహరించుకుంటారో ప్రజలకు బాబు సమాధానం చెప్పాలి’ అని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
కొనసాగిన ఎంపీల ఆందోళన
ఏపీకి హోదా కోరుతూ వైఎస్సార్సీపీ, టీడీపీ ఎంపీల ఆందోళన సోమవారం కూడా కొనసాగింది. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, తోట సీతారామలక్ష్మి, టీజీ వెంకటేశ్ తదితరులు నిరసన తెలిపారు. టీడీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు గాంధీ విగ్రహం వద్ద ఉదయం 10.30కు ధర్నా నిర్వహించారు. లోక్‌సభలో ఆ పార్టీ ఎంపీలు ప్రశ్నోత్తరాల సమయంలో తమ స్థానాల్లో నిల్చొని ప్లకార్డులు ప్రదర్శించారు. కాగా, వైఎస్సార్సీపీ, టీడీపీ ఎంపీల ఆందోళనతో మధ్యాహ్నం 12.09 నుంచి 12.27 వరకు రాజ్యసభ టీవీ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు.
Recommended Posts
Platin Casino No Deposit Bonus
05/02/2025
Pokern – Texas Hold’em Regeln
03/10/2024