గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రేపు, ఎల్లుండి జరగబోయే వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాకు 97 వేల మందికి పైగా అభ్యర్ధులు నమోదు చేసుకున్నారు.
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రేపు, ఎల్లుండి జరగబోయే వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాకు 97 వేల మందికి పైగా అభ్యర్ధులు నమోదు చేసుకున్నారు. మొత్తం 210 కంపెనీలు 26,289 ఉద్యోగాలు కల్పించబోతున్నాయి.
జాబ్ మేళాకు హాజరయ్యే ఉద్యోగార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి తాగునీరు, మజ్జిగ, భోజన సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఉద్యోగార్థులందరికీ మంచి ఉద్యోగాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
తిరుపతి, విశాఖ నగరాల్లో జరిగిన జాబ్ మేళాల్లో అంచనాలకు మించి 30,473 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇక గుంటూరు జాబ్ మేళాలో కల్పించనున్న 26,289 ఉద్యోగాలతో మొత్తం 50 వేల మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయి. రాబోయే రోజుల్లో ఇలాంటి జాబ్ మేళాలు మరిన్ని నిర్వహిస్తాం.