మా ఆశలకు ఊపిరి నువ్వే..

మా ఆశలకు ఊపిరి నువ్వే..

మా ఆశలకు ఊపిరి నువ్వే..

People Sharing Their Problems In Praja Sankalpa Yatra - Sakshiప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి నడుస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి, పక్కి దివాకర్, డాక్డర్‌ అరుణ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్‌ సుకుమారవర్మ

టీడీపీ పాలనలో అన్నీ కష్టాలే..

జననేత వద్ద మొరపెట్టుకున్న జనం

సాక్షి, విశాఖపట్నం:‘ఒంటరి మహిళలకు రేషన్‌ కార్డులు ఇవ్వడం లేదు. వయసు మీద పడినా పింఛన్‌ మంజూరు చేయడం లేదు.. మరుగుదొడ్లు కట్టుకున్నా బిల్లుల చెల్లింపులు లేవు.. ఈ ప్రభుత్వంలో మేము పడుతున్న కష్టాలు వర్ణణాతీతం’ అంటూ యలమంచిలి ప్రజలు జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వద్ద మొరపెట్టుకున్నారు. మా కష్టాలు తీరాలంటే నువ్వు రావాలి.. నువ్వు కావాలి.. నువ్వే మా ఆశలకు ఊపిరి అని వారంతా స్పష్టం చేశారు. ప్రజల విజ్ఞప్తుల మధ్య శుక్రవారం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర కొనసాగింది.

రేషన్‌ కార్డులు ఇవ్వడం లేదన్నా..
‘అన్నా.. మా చెల్లి పోతిరెడ్డి కుమారి భర్త ఐదేళ్ల కిందట చనిపోయాడు. ఆమె బ్రాండిక్స్‌లో పని చేస్తూ ఉపాధి పొందుతోంది. ఒంటరి మహిళ అని రేషన్‌ కార్డు ఇవ్వడం లేదన్నా’ అని ప్రజా సంకల్పయాత్రలో జననేత జగన్‌ను కలసి లైన్‌ కొత్తూరుకు చెందిన పైలా వరలక్ష్మి మొరపెట్టుకున్నారు. పింఛన్‌ కోసం దరఖాస్తు చేస్తే రేషన్‌ కార్డు కావాలంటున్నారు. ఒంటరి మహిళకు కార్డు ఇవ్వడం లేదు. ఎలా బతకాలన్నా అంటూ వాపోయారు. ప్రతి పథకానికి రేషన్‌ కార్డులు అడుగుతున్నారని, మాలాంటోళ్ల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు.

ఇద్దరు కొడుకులకూ రేషన్‌ కార్డు లేదు
‘జగన్‌ బాబూ.. నాకు ఇద్దరు కొడుకులున్నారు. వేర్వేరుగా జీవిస్తున్నారు. ఇద్దరికీ రేషన్‌ కార్డులు మంజూరు చేయలేదు. ఇప్పుడు ప్రతి పథకానికి రేషన్‌ కార్డు కావాలంటున్నారు’ అని లైన్‌ కొత్తూరుకు చెందిన బొంతు వరాలమ్మ ప్రజా సంకల్పయాత్రలో జననేత జగన్‌ను కలసి మొరపెట్టుకున్నారు. మీరు అధికారంలోకి వస్తే రేషన్‌ కార్డులు మంజూరు చేస్తారన్న ఆశ ఉంది నాయనా అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.

అంకుల్‌ మీరు ఆరోగ్యంగా ఉండాలి
‘అంకుల్‌ మీ ఆరోగ్యం బాగుండాలి. మా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర› చేస్తున్న మీకు ఆ దేవుడు చల్లగా చూడాలి. ప్రజలందరి అండదండలు మీకుంటాయి. మీరు సీఎం అవుతారు. మా కష్టాలను తీరుస్తారు’ అంటూ యలమంచిలి మండలం పోతురెడ్డిపాలెం గ్రామానికి చెందిన సి.హెచ్‌.అలేఖ్య ప్రజా సంకల్ప యాత్రతో జననేత జగన్‌ వద్ద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

బాగా చదువుకోమని చెప్పారు
మాది పులపర్తి గ్రామం. యలమంచిలి మండలం. ప్రజా సంకల్పయాత్రలో జగన్‌ అన్నయ్యను కలసి రాఖీ కట్టాను. ఆయన నన్ను ఆశీర్వదించారు. నేను 9వ తరగతి చదువుతున్నాను. బాగా చదువుకోమని చెప్పారు.  – తప్పెట్ల శరణ్య, పులపర్తి గ్రామం

రాఖీ కట్టడం ఎంతో ఆనందం
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మా ప్రాంతం గుండా వచ్చిన జగనన్నకు రాఖీ కట్టడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశం వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. నాకు ఇదొక తీపి గురుతుగా మిగులుతుంది. అన్న ఎంతో ఆప్యాయంగా నాతో రాఖీ కట్టించుకున్నారు. – అడపా లక్ష్మి, ములకలాపల్లి, యలమంచిలి మండలం

73 మందికిబిల్లులు ఇవ్వలేదు
మాది యలమంచిలి మండలం పీఎన్‌ఆర్‌ పేట. మా గ్రామంలో 250 మరుగుదొడ్లు మంజూరు కావడంతో నిర్మాణాలు పూర్తి చేశాం. కానీ 73 మంది లబ్ధిదారులకు మాత్రమే బిల్లులు చెల్లించారు. మిగిలిన వారికి నేటికి మూడు నెలలైనా బిల్లులు చెల్లించడం లేదు. ఈ విషయాన్ని అధికారులను ప్రశ్నించగా లబ్ధిదారులందరికి బిల్లులు చెల్లింపులు చేసినట్టు చెబుతున్నారు. టీడీపీ స్థానిక నాయకులు తమకు చెల్లించాల్సిన బిల్లులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి విన్నవించారు.   – పి.శ్రీనివాసరావు, పీఎన్‌ఆర్‌ పేట


Recommended Posts