విశాఖపట్నం సమీపంలోని జెర్రిపోతులపాలెం గ్రామంలో

విశాఖపట్నం సమీపంలోని జెర్రిపోతులపాలెం గ్రామంలో

విశాఖపట్నం సమీపంలోని జెర్రిపోతులపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల దాష్టీకానికి, దాడికి గురైన దళిత మహిళను, ఆమె కుటుంబాన్ని ఈరోజు పరామర్శించినపుడు బాధితురాలు జరిగిన దారుణాన్ని వివరిస్తుంటే చలించిపోయాను. తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలపై యధేచ్చగా సాగుతున్న భౌతిక దాడులు ఒక ఎత్తైతే ఈ సంఘటన మరో ఎత్తు.

సభ్యసమాజం తలదించుకునే రీతిలో సాగిన ఈ దారుణ చర్యకు పాల్పడ్డ నిందితులు స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరులేనని బాధితురాలు స్వయంగా చెబుతోంది. నిందితులకు శిక్ష పడేంత వరకు బాధితురాలికి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలబడి ఆమె తరఫున పోరాడుతుందని పూర్తి భరోసా ఇస్తున్నా…


Recommended Posts