400 రోజులు – విశాఖ నలుచెరుగులా ప్రగతి.

400 రోజులు – విశాఖ నలుచెరుగులా ప్రగతి.
30 మే 2019 – ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ గారు ప్రమాణస్వీకారం చేసింది మొదలు ఆంధ్ర ప్రదేశ్ లో సువర్ణాధ్యాయం మొదలయ్యింది. ముఖ్యంగా విశాఖపట్నం రూపు రేఖలు మారుతున్నాయి. నవశకానికి నాంది పడింది. అభివృద్ధిలో విశాఖను అగ్రగామిగా నిలపాలన్న ఆకాంక్ష ప్రభుత్వంలో బలంగా ఉంది. అందుకే మూడు రాజధానుల ప్రకటనలో భాగంగా వైజాగ్ పాలనా రాజధానవుతోంది. పోలవరం నుంచి జలాల తరలింపు నుంచి గిరిజన వైద్య కళాశాల , ఫిషింగ్ హార్బర్ , నైపుణ్య విశ్వవిద్యాలయం స్థాపన వరకు ఇలా ఒక్కో పని చేసుకుంటూ పోతోందీ ప్రభుత్వం.
ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి : ఉత్తరాంధ్రలో విశాఖ మినహా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయి. మొత్తం ఉత్తరాంధ్రను — విశాఖ తరహాలో అభివృద్ధి బాటపట్టించేందుకు ఇది తోడ్పడుతుంది. ఇది ఎన్నాళ్లగానో ఉన్న కల సాకారమైంది.
స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ : యువతకు ఉపాధి కల్పించడంపైనే ఒక ప్రాంత అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఇందులో భాగంగానే అడ్వాన్స్డ్ స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీని విశాఖకు ప్రభుత్వం మంజూరుచేసింది. 661 కోట్ల వ్యయంతో ఇది ఏర్పాటుకాబోతోంది. జిల్లాకో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా వస్తోంది.
ఫిషింగ్ హార్బర్లు : విశాఖలోని అచ్యుతాపురం మండలంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు కానుంది. భీమిలిలో ఫిష్ ల్యాండ్ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. వీటితోపాటు మరో రెండు ఫిషింగ్ హార్బర్లు ఉత్తరాంధ్రలో రానున్నాయి. ఉత్తరాంధ్ర వలసలను నిరోధించి… స్థానికంగానే ఉపాధి పొందడానికివి ఉపయోగపడతాయి.
మెడికల్ కాలేజ్ లు : సీతంపేట నుంచి పాడేరు వరకు అత్యధికంగా గిరిజన ప్రాంతాలున్నది ఉత్తరాంధ్రలోనే. మన్యం ప్రజలకు వరంకానుంది పాడేరులో ఏర్పాటుకానున్న ట్రైబల్ హెల్త్ యూనివర్సిటీ. అనకాపల్లిలోనూ వైద్యకళాశాల ఏర్పాటుకాబోతోంది. అంటే విశాఖపట్నం మెడికల్ హబ్ గా మారబోతోంది.
గోదావరి జలాలు- కాన్సెప్ట్ సిటీ :
పోలవరం నుంచి గోదావరి జలాలను విశాఖకు తరలించాలని ముఖ్యమంత్రి జగన్ గారు సంకల్పించారు. దాదాపు విశాఖ జిల్లామొత్తానికి గోదావరి జలాలందనున్నాయి. వేసవి దాహర్తికి ఇకపై చెక్. అన్ని మౌలిక సదుపాయాలతో విశాఖ ఒక కాన్సెప్ట్ సిటీగా మారబోతోంది. దీని వల్ల నగరానికి కాస్మోపాలిటన్ హంగులొస్తాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రానికే ఉత్తరాంధ్ర ఒక గ్రోత్ ఇంజిన్ గా మారబోతోంది. సీపోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, రోడ్డు – రైలు కనెక్టివిటీ ఉన్న విశాఖ రాష్ట్రానికే తలమానికం. మెట్రో రైలు పరిధిని కూడా 40 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
Recommended Posts
Casino Online Que Acepta Mastercard
26/06/2025
Paypal Casino Utan Svensk Licens
20/12/2024
CASINO MUNKEBJERG
28/10/2024