విశాఖ చుట్టూ అభివృద్ధి – రాష్ట్రానికే రాజయోగం.

విశాఖ చుట్టూ అభివృద్ధి – రాష్ట్రానికే రాజయోగం.
ఏదైనా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే – దానికి కచ్చితంగా ఒక మెగా సిటీ ఉండాలి – లేకపోతే మహానగరాన్ని అభివృద్ధి చేయాలి – అక్కడ నుంచి ఆదాయం , లక్షల్లో ఉద్యోగాలు రావాలి. ఆ నగరం చుట్టూ పారిశ్రామికీకరణ ఒక పద్ధతి ప్రకారం జరగాలి. అలాంటి నగరం నుంచి వచ్చిన ఆదాయంతో ఆ సిటీతోపాటు రాష్ట్రమంతా అభివృద్ధి పట్టాలపై పరుగులు పెడుతుంది. తెలంగాణలో హైదరాబాద్, తమిళనాడులో చెన్నై, కర్ణాటకలో బెంగళూరు, బెంగాల్ లో కోల్ కతా , హిమాచల్ లో సిమ్లా అలాంటి నగరాలే. హైదరాబాద్ లో ఐటీ – ఫార్మా, చెన్నైలో ఐటీ – ఆటోమొబైల్, బెంగళూరులో ఐటీ – ఫార్మా- ఎరోస్పేస్ , కోల్ కతాలో స్టీల్ – టెక్స్ టైల్స్ జ్యూట్ , సిమ్లాలో టూరిజం . ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన విశాఖకు ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. సిమ్లాలోలా టూరిజం నుంచి హైదరాబాద్ లోలా ఫార్మా వరకు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తోంది మన వైజాగ్ – ఐటీ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోనూ హైదరాబాద్ తర్వాత ఐటీ రంగం అభివృద్ధి చెందిన ఏకైక నగరం విశాఖ మాత్రమే. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాగే విశాఖపై ఫోకస్ పెడితే … ఒక రెవెన్యూ జనరేటింగ్ ఇంజిన్ లా మారుతుంది. నగరం ఎదుగుతూ మిగతా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది.
దేశంలోనే ఎక్కడాలేని సహజసిద్ధమైన పోర్టు ఉంది మన విశాఖలో . అయితే నేను ముందే చెప్పినట్లు ఈ నగర అభివృద్ధిపై పాలకులు పెద్దగా దృష్టిపెట్టకపోవడంతో… సిటీవరకు అభివృద్ధి ఉన్నా ఉత్తరాంధ్ర బాగా వెనుకబడిపోయింది. పరిపాలనా రాజధాని అవుతున్న తరుణంలో జగన్ గారి ప్రభుత్వం నగరాన్ని దాని చుట్టుపక్కల ప్రాంతాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కంకణబద్దమై ఉంది. విశాఖపట్నం రెండు గంటల దూరంలోనే ఉన్నా శ్రీకాకుళం అత్యల్ప తలసరి ఆదాయంతో అట్టడుగున ఉండిపోయింది. జస్ట్ గంట దూరంలో ఉన్న విజయనగరం అత్యల్ప తలసరి ఆదాయంలో రెండో స్థానం. విశాఖ పాలనా రాజధానైతే శ్రీకాకుళం , విజయనగరం జిల్లాల్లోనూ అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయం. ఈ రెండు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్ని సహజ వనరులున్నా… ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ తప్ప ఎవరూ పెద్దగా దృష్టి పెట్టకపోవడమే. ఏడాది పాలనలోనే ఫిషింగ్ హార్బర్ల నుంచి స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ, గిరిజన వైద్యకళాశాల వరకు విశాఖకు ఎన్నో మేళ్లు చేశారు జగన్ గారు. ఇక పాలనా రాజధానిగా మారితే చెప్పాల్సిన పనిలేదు.
పచ్చ పత్రికలు భూకంపాలన్నా, డర్టీయెస్ట్ పొలిటీషియన్ దడపుట్టించాలనుకున్నా, ఎల్లో వైరస్ సునామీలు సృష్టించాలనుకున్నా ఇప్పుడు ప్రజలకు సమాచారం రకరకాల సోర్సెస్ నుంచి అందుతోంది. సముద్రాన్ని అడ్డంపెట్టుకుని విష ప్రచారం నడవదు- పైగా సముద్రం అంటే కోట్లాదిమందికి ఒక తల్లి, ప్రధాన ఆదాయవనరు. అదో అడ్వాంటేజ్ కూడా. అంతెందుకు 2004లో సునామీవచ్చి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షల మంది చనిపోయినప్పుడు – విశాఖలో సముద్రం ఒక్క అడుగైనా ముందుకు వచ్చిందా? డాక్ యార్డ్ లోని ఒక్క నౌకైనా తల్లకిందులయ్యిందా?. పెట్టని కోటల్లాంటి కొండలు, సముద్రమట్టానికి నగరం ఎత్తుగా ఉంటే సునామీలు ఎలావస్తాయి? అసలు సునామీలు అండమాన్ నికోబార్ దీవుల్ని దాటతాయా? కొంచెం టోపోగ్రఫీ, జాగ్రఫీ చదవండి… వాటిపై మరో వ్యాసంలో చెప్తాను. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధన్న లక్ష్యం తప్ప … the sky is falling లాంటి కథలకు కాలం చెల్లిందని గుర్తించండి.
Recommended Posts
Casino Online Que Acepta Mastercard
26/06/2025
Paypal Casino Utan Svensk Licens
20/12/2024
CASINO MUNKEBJERG
28/10/2024