శ్రీకాకుళం జిల్లాను చంద్రబాబు చిదిమేశాడు.

శ్రీకాకుళం జిల్లాను చంద్రబాబు చిదిమేశాడు.

శ్రీకాకుళం జిల్లాను చంద్రబాబు చిదిమేశాడు.

Part-2.

శ్రీకాకుళం జిల్లా చాలా కాలం టీడీపీ కంచుకోటగా ఉండేది. దాన్ని బద్దలుగొట్టింది వైఎస్ఆర్, జగన్ గారు మాత్రమే… వైఎస్ఆర్ వచ్చేవరకు పచ్చపార్టీ కుట్రలను సవాల్ చేసినవారు లేరు. అయినా ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లాగా ఉండిపోయింది. చంద్రబాబు 14 ఏళ్లకాలంలో ఈ జిల్లాలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. ఎన్నికల ముందు కొంతమంది నేతలకు డబ్బు పంచడం… ఓట్లను మేనేజ్ చేయండని హుంకరించడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు.

– శ్రీకాకుపళం ఏమీ కరువుజిల్లా కాదు… రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం కురిసేది ఈ జిల్లాలోనే. వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బహుదా, సువర్ణముఖి లాంటి నదులున్నాయి. ప్రతి నియోజకవర్గానికీ జలవనరులున్నాయి. చంద్రబాబు తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు బహుదానదిపై చిన్న ఆనకట్ట కట్టి ఇచ్చాపురం నుంచి పలాసవరకు సస్యశ్యామలం చేస్తానన్నాడు. తర్వాత ఆ ఊసేలేదు. ఆయన 14 ఏళ్లపాలనతో ఒక్కటంటే ఒక్క ఆనకట్ట కట్టింది లేదు. తోటపల్లి బ్యారేజీ, వంశధార ఫేజ్‌-2, తారకరామతీర్థసాగర్‌,ఆఫ్‌షోర్‌లలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ పూర్తిచేయలేదు.

– తన 14 ఏళ్ల పాలనలో శ్రీకాకుళంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టలేదు. జిల్లా వెనుకబడిందంటూ బీద అరుపులు అరిచేవాడు చంద్రబాబు – పేదలున్న జిల్లాలో ప్రైవేట్ చదువులెలా చదువుతారన్న ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరించారు.

-రాష్ట్రంలో నెల్లూరుతర్వాత సుదీర్ఘ సముద్రతీరం ఉన్న జిల్లా శ్రీకాకుళం.

-భావనపాడు,కళింగపట్నం లాంటి పోర్టులున్నా… 14 ఏళ్లలో చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. కనీసం మత్స్యకారులకు ఒక ఫిషింగ్ హార్బర్, జెట్టీ కట్టిన పాపానపోలేదు. అందుకే జిల్లాలోని మత్స్యకారులు గుజరాత్ లేదా అండమాన్ తీరానికి వలస వెళ్లడం పరిపాటిగా మారింది.

-ఉద్దానం ప్రాంతాన్ని కిడ్నీ వ్యాధులు కబలిస్తుంటే … ఒక్క డయాలసిస్ కేంద్రం కూడా పెట్టలేదు. విశాఖ వెళ్లాల్సివచ్చేది… కనీసం ఆర్థికంగా ఆదుకోలేదు. అందుకే ఒకప్పుడు కేరళతీరాన్ని తలపిస్తూ ఉద్యానవనంలా కనిపించే ఉద్దానం బక్కచిక్కిపోయింది.

– వెనుకబడ్డ జిల్లాలకిచ్చే 50 కోట్ల రూపాయల నిధులను చంద్రబాబు దారిమళ్లించి శ్రీకాకుళానికి దక్కకుండా చేశాడు చంద్రబాబు.

-శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి సూర్యదేవాలయం, శ్రీకూర్మం, శ్రీముఖలింగం,రావివలస, శాలిహుండంలో అతిపురతన ఆలయాలు, బౌద్ధఆరామాలున్నాయి. అయినా వీటినేమీ పర్యాటక ప్రాంతాలుగా మార్చే ప్రక్రియ చేపట్టలేదు.

– సహజ వనరులు, కష్టించే మనుషులున్నా వలసలు తప్ప జిల్లాలో వేరే ఉపాధి మార్గం లేదంటే దానికి కారణం చంద్రబాబు నాయుడే. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ పెట్టించలేదు.

– జిల్లాలో విద్య, ఆరోగ్యంపైనా చంద్రబాబు చేసిన ఖర్చు జీరో. కేంద్ర నిధులతో బస్ సెల్టర్లు నిర్మించి… వాటిపై బస్సులకన్నా పెద్ద పేర్లను రాయించుకోవడం తప్ప ఎర్రన్నాయుడు కుటుంబం చేసింది శూన్యం. ఆ బస్ షెల్టర్లకన్నా ఆ పేర్లు రాయించుకోవడానికయ్యే ఖర్చు ఎక్కువ.

– పాతపట్నం, మెళియాపుట్టి, తేపరలాంటి ప్రాంతాలకు పెద్ద పట్టణం పలాస… ఏ జబ్బొచ్చినా జ్వరం వచ్చినా అక్కడికే వెళ్తారు జనం. కానీ అక్కడ సరైన ఆస్పత్రి లేదు… ప్రతిదానికీ వైజాగ్ కు రిఫర్ చేయడమే.

– పలాస, టెక్కలి, నందిగామ,వజ్రపుకొత్తూరు సహా… శ్రీకాకుళంలో చాలా ప్రాంతానికి నీటి సదుపాయం కల్పించాలన్న సంకల్పంతో 2008లో వైఎస్ఆర్ ఆఫ్ షోర్ ప్రాజెక్టుకు శంకు స్థాపన చేశారు. దాన్ని ఒక్క ఇంచ్ కూడా కదలనీయకుండా అడ్డుకున్నాడు చంద్రబాబు. మహేంద్ర తనయ నీటిని సముద్రంపాల్జేశాడు చంద్రబాబు.

వైఎస్ఆర్సీపీ వచ్చాక

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగు,తాగునీరు , పరిశ్రమలకు పూర్తిస్థాయిలో నీటిని అందించేందుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని శరవేగంగా పూర్తిచేయాలని నిర్ణయించారు. వైఎస్సార్ హయాంలోనే పురుడుపోసుకున్న ఈ పథకానికి తర్వాత ప్రభుత్వాలు తుప్పలుపట్టించాయి… మళ్లీ ఇప్పుడు ఊపందుకుంటోంది. ఎనిమిది లక్షల ఎకరాలకు నీరందించే పథకమిది.

-నాగవళి, వంశధార ప్రాజెక్టుల అభివృద్ధి పనులను చేపట్టడం ద్వారా శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు వైసీపీ సర్కార్ అడుగులు వేస్తోంది. ఆఫ్ షోర్ ప్రాజెక్టు మళ్లీ అడుగులేస్తోంది

-ఉత్తరాంధ్ర సహజసిద్ధ అందాలను పర్యాటక ప్రాంతాలుగా, షూటింగ్ స్పాట్స్‌గా అభివృద్ధి చేయాలని జగన్ గారు సంకల్పించారు. టాలీవుడ్ ప్రముఖులుకూడా వీటిపై దృష్టిపెట్టారు. దీనివల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

– శ్రీకాకుళంలో వలసలు ఆపేందుకు పారిశ్రామిక , సేవల రంగాలను జగన్ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహించనుంది.