శ్రీకాకుళం జిల్లాను చంద్రబాబు చిదిమేశాడు.

శ్రీకాకుళం జిల్లాను చంద్రబాబు చిదిమేశాడు.
Part-1.
ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కళింగ, రెడ్డిక జనాభా చాలా ఎక్కువ. అందుకే ఆ కులాల కోసం ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటుచేసింది జగన్ గారి ప్రభుత్వం.
బీసీ “ఏ” కేటగిరీలో – లక్షల సంఖ్యలోనున్న ఆ కులాలకు తగిన చేయూతనిస్తూ పైకి తీసుకురావాలన్నదే లక్ష్యం. అయితే ఈ రెండు కులాలను ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తూ … 14 ఏళ్లపాటు అధికారంలోనున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు. పైగా జిల్లాలోని నాయకులు ఉద్దేశపూర్వకంగా వేధించేవారు. బీసీల్లోని బీసీలకే కయ్యంపెట్టి పబ్బం కడుపుకునే చంద్రబాబు రాజకీయాలకు బలైపోయారు. ఎన్నికలు రాగానే చంద్రబాబు కుల రాజకీయాలను తారాస్థాయికి తీసుకెళ్తూ… ఆయా కులాల్లోని కొంతమందికి డబ్బులు పంచి… రెచ్చగొట్టి … భయపెట్టి ఓట్లు కొట్టేయడమే పనిగా పెట్టుకున్నాడు.
-14ఏళ్ల చంద్రబాబు పాలనలో శ్రీకాకుళం జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్, DCMS ఛైర్మన్ గానీ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిగానీ కళింగ లేదా రెడ్డిక కులాలకు దక్కలేదు. కనీసం డైరెక్టర్ పదవికూడా ఇవ్వలేదు. జగన్ గారు అధికారం చేపట్టాక DCMS Chairmanగా కళింగ వర్గానికి చెందిన పిరియా సాయిరాజ్ బాధ్యతలు చేపట్టారు.
– తన 14 ఏళ్ల పాలనలో నామినేటెడ్ పదవులకు రెడ్డిక, కళింగ వర్గాలను దూరంగా పెట్టడు చంద్రబాబు. శ్రీముఖలింగం, అరసవల్లి సూర్యదేవాలయం, శ్రీకూర్మం, లాంటి దేవాలయాల ట్రస్ట్ పదవులు కూడా దక్కలేదు .
– ఎంతో మంది ఉన్నత విద్యావంతులున్నా కళింగ, రెడ్డిక వర్గాలనుంచి ఒక్క వైస్ ఛాన్సలర్ ఉద్యోగం ఇవ్వలేదు. వైసీపీ వచ్చాక… ఎచ్చెర్లలో ఉన్న అంబేద్కర్ యూనివర్సిటీ వీసీగా కళింగ వర్గానికి చెందిన వ్యక్తికి వచ్చింది. విజయనగరంలో పెట్టబోయే కేంద్ర గిరిజన యూనివర్సిటీ మెంటర్ గా కళింగ వర్గానికి చెందిన లజపతిరాయ్ ను నియమించింది.
– కళింగ, రెడ్డిక కులాలవారు 50 శాతానికిపైగా ఉండే ఉద్దానం ప్రాంతంలో ఒక్కటంటే ఒక్క డయాలసిస్ కేంద్రం పెట్టలేదు. కిడ్నీ వ్యాధులు రావడం… స్థానిక డాక్టర్లు విశాఖ ఆస్పత్రులకు రిఫర్ చేయడం … డబ్బుల్లేక కిడ్నీ వ్యాధులతో ఉద్దానంవాసులు చనిపోవడం పరిపాటిగా మారింది. వేలమంది ఇలా చనిపోవడంతో… బాగా సెటిలైనా సరే ఉద్దానం వాసులకు పిల్లనివ్వడానికి కూడా ఎవరూ ముందుకొచ్చేవారు కాదు. వైసీపీ కృషితో సోంపేటలాంటి చోట్ల డయాలసిస్ కేంద్రాలొచ్చాయి. కిడ్నీ వ్యాధి బారినపడితే… మందులు, ట్రీట్మెంట్ ఉచితం చేయడంతోపాటు… నెలకు పదివేల చొప్పున జగన్ గారి ప్రభుత్వం పెన్షన్ ఇస్తోంది.
– తప్పనిసరి పరిస్థితుల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో కొన్నింటిని కళింగలకు ఇచ్చినా … ఎర్రన్నాయుడు కుటుంబం నిత్యం వేధింపులకు గురిచేసేది. అచ్చెంనాయుడు ఏకంగా 200 మంది కళింగ వర్గానికి చెందిన అధికారులను పాడేరు, చింతపల్లి, జీ మాడుగుల, రాయలసీమలాంటి ప్రాంతాలకు ట్రాన్స్ ఫర్ చేయించాడు. పలాస ఐసీడీఎస్ అధికారిణిగా ఉన్న వికలాంగురాలు కళింగ వర్గానికి చెందిన ఒక అధికారిణిని ( శార్వాణి) ఏకంగా పాడేరు అడవులకు పంపించాడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆమె వెనక్కివచ్చారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
– రైతులకు సబ్సిడీల్లో వచ్చే ట్రాక్టర్ల విషయంలోనూ చంద్రబాబు సర్కార్ వివక్ష చూపుతూ … కళింగలకు నామమాత్రంగా ఇచ్చారు… రెడ్డిక వర్గంలో కేవలం కొద్దిమంది టీడీపీ మద్దతుదారులకు తప్ప ఎవరికీ దక్కలేదు.
– అసైన్డ్ ల్యాండ్స్ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతిదానికి ఎర్రన్నాయుడి కుటుంబంలోని కొద్దిమంది కూర్చొని… నిర్ణయించారు.
-తెలుగుదేశం చోటా నాయకులు చెప్తే… కళింగ, రెడ్డిక వర్గాలకు చెందినవారిని జిల్లా దాటించి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు పంపించేయండంటూ లెటర్లు రాసిన ఘనత మాజీ మంత్రి అచ్చెన్నాయుడిది. రాజకీయాలతో పెద్దగా సంబంధంలేని కళింగ, రెడ్డిక టీచర్లను సైతం వేధిస్తూ… ట్రాన్స్ ఫర్లు చేస్తూ దుర్భాషలాడేవారు చంద్రబాబు హయాంలో. ప్రతి విషయాన్ని కులం కోణంలోనే చూసేవాడు.
– ప్రభుత్వం ఇచ్చే ఉచిత గృహాల్లోనూ కళింగ, రెడ్డిక కులాలకు మొండిచేయి చూపేవారు. చంద్రబాబు హయాంలో రెడ్డిక కులాన్ని ఎంబీసీలుగా గుర్తించినా … ఒక్క రూపాయికూడా నిధులివ్వలేదు. రెడ్డిక కులానికి ఒక్కటంటే ఒక్క అసైన్డ్ ల్యాండ్ ను కేటాయించలేదు.
– టెక్కలి సమీపంలోని కాకరాపల్లిలో ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్లాంట్ దగ్గర పోలీసుల కాల్పుల్లో నలుగురు చనిపోయారు. ఆ నలుగురూ రెడ్డిక సామాజికవర్గానికే చెందినవారు కావడంతో… సరైన ఎక్స్ గ్రేషియా కూడా దక్కలేదు. విశాఖలో ప్రమాదం జరిగితే జగన్ గారి ప్రభుత్వం కోటి చొప్పున పరిహారం ఇచ్చింది.
– పచ్చని పల్లెల్లో కులచిచ్చుని రగిల్చి అందులో చలికాగడం చంద్రబాబు అలవాటు చేసుకున్నాడు. ఈ విషయాలన్నీ ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతున్నాయి.
To be continued…….Part-2
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024