నీ తోడుగా..ఎందాకైనా..

నీ తోడుగా..ఎందాకైనా..

నీ తోడుగా..ఎందాకైనా..

New Couple Meet In Praja Sankalpa Yatra - Sakshi

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి నడుస్తున్న చింతపల్లి మాజీ ఎమ్మెల్యే కుమార్తె గొట్టేటి మాధవి, చిత్రంలో విజయసాయిరెడ్డి

విశాఖపట్నం : అడుగడుగునా ఆవేదనలు.. వందలాది విజ్ఞప్తులు.. పింఛన్‌ ఇవ్వలేదని, ఉపాధి కరువైందని, వివక్షకు గురయ్యామని, రెండు కిడ్నీలు పాడైనా ఆరోగ్య శ్రీ వర్తిం^è లేదని, నష్టపరిహారం చెల్లించలేదని, మరుగుదొడ్డి బిల్లులు రాలేదని.. ఇలా ఎవ్వరిని కదిపినా కన్నీటి గాథలే.. ప్రజా సంకల్పయాత్రలో జననేత జగన్‌ వద్ద యలమంచిలి ప్రజలు తమ కష్టాలను చెప్పుకున్నారు. నీ తోడుగా ఎందాకైనా వస్తామని.. ముఖ్యమంత్రి అయ్యాక మమ్మల్ని ఆదుకోవాలని హామీ కోరారు. ఇలా ప్రజల సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ విరామ మెరుగక వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రజా సంకల్పయాత్రను జిల్లాలో కొనసాగించారు.

జగనన్న ఆశీర్వాదం కోసం వచ్చాం
మాది స్వయంవరం. పరవాడ మండలం. శుక్రవారం రాత్రి మాకు వివాహం జరిగింది. అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించడానికి బయలుదేరాం. యలమంచిలి సమీపంలో జగనన్న ఉన్నారని తెలిసి ఆయన్ను కలిసేందుకు ఇక్కడకు వచ్చాం. ఆయన ఆశీర్వాదం తీసుకున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది.    – బొండా సాయికుమార్, రమ్య  

రూ.18 వేల వేతనం ఇవ్వాలి
మాది మూలజంప. రాంబిల్లి మండలం. ప్రతి పనినీ అంగన్‌వాడీ కార్యకర్తల చేతే  చేయిస్తున్నారు. కాని జీతాలు మాత్రం అంతంతమాత్రమే. అనేక పోరాటాల తర్వాత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు ఇటీవల మాకు రూ. 10 వేల వరకు జీతాలు పెంచారు. మేము చేసే పనికి రూ.18 వేలు చెల్లించాలి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మా సమస్యను తెలియజేశాం. మన ప్రభుత్వం వచ్చాక జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు– పి. సావిత్రి, అంగన్‌వాడీ కార్యకర్త, మూలజంప

విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికికృషి చేయండి
విశ్వ బ్రాహ్మణులు అన్నింటా వెనుకబడి ఉన్నారు. వైఎస్సార్‌ సీపీతో మేలు జరుగుతుందని ఎదురుచూస్తున్నారు. మా సామాజిక వర్గానికి ప్రత్యేక పథకాలు రూపొందించాలి. ఇదే విషయాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించాను.– అలజంగి కృష్ణ, విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

బీసీల అభ్యున్నతికి సహకరించండి
రాష్ట్రంలో 60 శాతం బీసీలు ఉన్నందున ఎమ్మెల్యే సీట్ల లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కోరాను. యువతకు ప్రభుత్వ కాంట్రా క్ట్‌లకు సంబంధించి డిపాజిట్‌ మినహాయించాలని, క్రిమిలేయర్‌ విధానాన్ని రద్దు చేయాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగా బీసీలకు కూడా ప్రత్యేక చట్టం అమలు చేయాలని వినతిపత్రం అందించాను.  – వి.బాలాజీ ప్రసాద్, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు

నీ చేత్తో అక్షరాభ్యాసం చేయించన్నా..
‘పిల్లలను బడికి పంపిస్తే ప్రతి నెలా రూ.500 ఇస్తానన్నావు. చాలా సంతోషం. నా కుమార్తె మోక్షితకు నీ చేత్తో అక్షరాభ్యాసం చేయించన్నా’ అంటూ ఆమె తల్లిదండ్రులు జననేత జగన్‌ను కోరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గొకివాడ వద్ద ఆయన చిన్నారితో అక్షరాభ్యాసం చేయించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన భరోసాతో తమ లాంటి పేదల ఇళ్లల్లో విద్యా వెలుగులు వ్యాప్తి చెందుతాయని వారు ఆకాక్షించారు.

ఉపాధి కాపాడన్నా..
‘అన్నా.. 15 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నాం. ఈ పథకాన్ని ప్రైవేట్‌పరం చేసి మా ఉపాధి దెబ్బ తీయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అంటూ దిమిలికి చెందిన గట్టు రాఘవ, ధనలక్ష్మి తదితరులు ప్రజా సంకల్పయాత్రలో జననేత జగన్‌ను కలసి మొరపెట్టుకున్నారు. ఐదు నెలలుగా తమకు జీతాలు, మెస్‌ బిల్లులు చెల్లించడం లేదని వాపోయారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ఉపాధి కాపాడి జీతాలు పెంచాలని వారు కోరారు.

పరిహారం కోసం 17 రోజులుగా ధర్నా
నేవల్‌ బేస్‌ భూ సేకరణలో భాగంగా 26 కొబ్బరిచెట్లు ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారం అందజేయలేదు. నేవల్‌ బేస్‌ ఏర్పాటుతో ఉపాధి కో ల్పోయాం. మా గ్రామాన్ని నేవీ ప్రభావిత ప్రాంతంగా గుర్తించి ప్యాకేజీ అందజేయాలని 17 రోజులుగా ధర్నా చేస్తున్నాం. ఈ విషయాన్ని జగనన్న దృష్టికి తీసుకు వెళ్లగా.. న్యాయం చేస్తామని మాటిచ్చారు.           – జల్లి పోలమ్మ, చినకలవలాపల్లి, రాంబిల్లి

100 పాఠశాలలు మూసేశారు
ఏజెన్సీలో విద్యావ్యవస్థ అధ్వానంగా ఉంది. గిరి జన విద్యపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. వి ద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని 11 మండలా ల్లోని 100 పాఠశాలలను మూసేశారు. దీంతో విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరమవుతున్నారు.  పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులు, లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయడం లేదు. జననేత జగన్‌ను కలసి ఈ విషయాలను వివరించాను.
– కోడా సింహాద్రి, వైఎస్సార్‌ టీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అరకు

అ.. ఆ..లు దిద్దించారు
మాది రాంబిల్లి మండలం ఎం.కొత్తూరు. మా అమ్మాయి కోట కీర్తన సాయికి జగన్‌ అన్నతో అక్షరాభాస్యం చేయించాలని నిర్ణయించుకుని కలిశాం. ఆయన ఎంతో ఆప్యాయంగా అమ్మాయితో అ..ఆ..లు దిద్దించారు. ఇది జీవితంలో మరిచిపోలేని సంఘటన. ఈ అవకాశం మాకు రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం.–కీర్తన సాయితో తల్లిదండ్రులు చిరంజీవి, లక్ష్మి

50 ఏళ్లకే పింఛన్‌ ఇవ్వాలన్నా..
ఎండనక వాననక కష్టపడే భవన నిర్మాణ కార్మికుల జీవితాలకు భరోసా లేదు. పేద ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వచ్చిన  జగనన్నకు మా కష్టాలు చెప్పుకున్నాం. భవన నిర్మాణ కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్‌ సదుపాయం కల్పించడంతో పాటు రూ.3 వేలు పింఛన్‌ ఇస్తే వృద్ధాప్యంలో మాకు ఆసరాగా ఉంటుందని తెలిపాం. వర్షా కాలంలో 3నెలల పాటు తమకు కూలి పనులు ఉండవని, ఆ సమయంలో జీవన భృతిగా నెలకు రూ.5 వేలు చొప్పున ఇవ్వాలని కోరాం. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే తప్ప కుండా న్యాయం చేస్తానన్నారు. ఆయన ఇచ్చిన భరోసా మాకు ఎంతో సంతోషానిచ్చింది.
– ఎస్‌.రాంబాబు, ఎ.రామకృష్ణ, ఎ. రమేష్,శ్రీ దుర్గా భవన నిర్మాణ కార్మిక సంఘం, రాంబిల్లి మండలం


Recommended Posts