విశాఖపట్నం అంతర్జాతీయ ఎయిర్‌ పోర్ట్‌లో పౌర విమాన సర్వీసుల రాకపోకలపై…

విశాఖపట్నం అంతర్జాతీయ ఎయిర్‌ పోర్ట్‌లో పౌర విమాన సర్వీసుల రాకపోకలపై...

విశాఖపట్నం అంతర్జాతీయ ఎయిర్‌ పోర్ట్‌లో పౌర విమాన సర్వీసుల రాకపోకలపై నేవీ  విధిస్తున్న ఆంక్షల వలన పర్యాట రంగంతోపాటు వాణిజ్య కార్యకలాపాలకు తీవ్ర నష్టం వాటిల్లో ప్రమాదం ఉందని ఈరోజు  రాజ్య సభ జీరో అవర్‌లో రక్షణ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారమన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. విశాఖపట్నం ప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా ఈ ఆంక్షలను విరమించుకోవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. నేవీ ఆంక్షల వలన జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసుకున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మించే వరకు నేవీ తమ విమానాల రాకపోకల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని కోరడం జరిగింది.