ఇది కుమ్మక్కు కాదా…? బీజేపీ-టీడీపీ కుమ్మక్కుకు ఇంతకంటే ఏం రుజువు కావాలి?

ఇది కుమ్మక్కు కాదా...? బీజేపీ-టీడీపీ కుమ్మక్కుకు ఇంతకంటే ఏం రుజువు కావాలి?

ఇది కుమ్మక్కు కాదా…? బీజేపీ-టీడీపీ కుమ్మక్కుకు ఇంతకంటే ఏం రుజువు కావాలి?

అఖిలపక్ష సమావేశం అనంతరం మంగళవారం ఢిల్లీలో మీడియాతో…

టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీ బుట్టా రేణుకను వైయఆర్సీపీ డిప్యూటీ లీడర్ గా అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడం అంటే ఏం సంకేతాలు ఇస్తున్నట్టు? ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చినా, ఇప్పటికీ టీడీపీ- బీజేపీ లాలూచీ, కుమ్మక్కు రాజకీయాలు కొనసాగుతున్నాయనడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి?

వైయస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన బుట్టా రేణుకను ఏ హోదాలో అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారు? పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన బుట్టా రేణుకపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే లోక్ సభ స్పీకర్ కు పలు ధపాలుగా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే, స్పీకర్ నిర్ణయం తీసుకోనందునే ఆమెను వైయస్ఆర్సీపీ డిప్యూటీ లీడర్ గా పిలిచామంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి అనంతకుమార్ సమర్ధించుకునే ప్రయత్నం హర్షణీయం కాదు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి అధికారిక లేఖ ఇవ్వకుండా.. ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుకను ఆహ్వానించడం ముమ్మాటికీ తప్పే.
ఈ విషయాన్ని నేరుగా ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. బుట్టా రేణుకను వైయస్ఆర్సీపీ డిప్యూటీ లీడర్ గా ఆహ్వానిస్తూ.. అఖిలపక్ష సమావేశంలో బోర్డు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టాను. తక్షణం ఆమె పేరుతో ఉన్న నేమ్‌ బోర్డును తొలగించకపోతే.. తాను సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తానని హెచ్చరించా. నా వాదనను బలపరిచిన అన్ని ప్రతిపక్ష పార్టీలు. దాంతో వెనక్కి తగ్గిన పార్లమెంటరీ పార్టీ నేత అనంతకుమార్.. ఆ వెంటనే బుట్టా రేణుక నేమ్ బోర్డు తొలగింపు.
——————————–
అలానే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేయాలని ప్రధాని సమక్షంలోనే కోరడం జరిగింది. విభజన హామీలపై ప్రధాని స్పందించలేదు. మహిళా రిజర్వేషన్ల బిల్లును తక్షణమే చట్టం చేయాలని ప్రధానిని కోరాను. అలానే బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని సమావేశంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.

కనీసం తెలుగు, ఇంగ్లీషు కూడా మాట్లాడటం రాని నాటు సారా వ్యాపారి అయిన సీఎం రమేష్ ను తెలుగుదేశం పార్టీ పార్లమెంటుకు పంపడం వల్ల ఆయన తెలుగు వారి పరువును ఢిల్లీ వీధుల్లో తీస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇంగ్లీషు రాదు. ఆయన కొడుకు లోకేశ్ కు తెలుగు కూడా రాదు. వీళ్ళా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది? వీళ్ళా రాష్ట్రం కోసం పోరాడేది..?


Recommended Posts