విశాఖపట్నం జిల్లా అభివృద్ధిపై ఇన్ చార్జ్ మంత్రి శ్రీ కన్నబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం జరిగింది.
విశాఖపట్నం జిల్లా అభివృద్ధిపై ఇన్ చార్జ్ మంత్రి శ్రీ కన్నబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం జరిగింది. సింహాచలం ఆలయ భూములు ఆక్రమణలకు గురికాకుండా నా ఎంపీల్యాడ్స్ నిధులు రూ.5 కోట్లతో పాటు దాతల సహకారంతో ప్రహరీ నిర్మాణానికి హామీ ఈసందర్భంగా ఇవ్వడం జరిగింది.
విశాఖలోని ఆలయాల పునరుద్ధరణలో భాగంగా మొదటి విడతలో 100 ఆలయాల అభివృద్ధిని చేపట్టినట్లు వివరించడం జరిగింది. షీలానగర్ లోని కోవిడ్ కేర్ సెంటర్ ఉన్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, సిలిండర్లు, ఇతర పరికరాలను కేజీహెచ్, విమ్స్ వంటి ప్రభుత్వ ఆస్పత్రులకు అందజేయనున్నట్లు తెలియజేయడం జరిగింది.