In Tadepalli on 4 July 2023
మన్యం వీరుడికి వందనం
గిరిజన హక్కులను కాలరాస్తూ నాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువచ్చిన అటవీ చట్టానికి వ్యతిరేకంగా గిరిజనులతో కలిసి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయులపై చేసిన తిరుగుబాటు, సాగించిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆ మహనీయుని పోరాటం త్యాగానికి గుర్తుగా వైయస్ జగన్ గారి ప్రభుత్వం గిరిజన జిల్లాకు ఆయన పేరును పెట్టింది. ప్రభుత్వ అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో విద్యా, వైద్య రంగాలతో పాటు మౌలిక సదుపాయాలకు ఈ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యత కల్పిస్తోంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది.