జగనన్నతో నడిచేందుకు సిద్ధం..

జగనన్నతో నడిచేందుకు సిద్ధం..
జగనన్నతో నడిచేందుకు సిద్ధం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మెచ్చి, ప్రజా సేవ కోసం శ్రీ సిఎం YS Jagan Mohan Reddy గారు అనుసరిస్తున్న విధానాలు నచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి జగన్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బస్సు యాత్రకు జగన్ గారు రేణిగుంట చేరుకోగా అక్కడే విష్ణువర్దన్ రెడ్డి తన అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కావలి నియోజకవర్గంలో ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న విష్ణువర్దన్ రెడ్డి గారు ప్రజలకు మెరుగైన సేవ చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడం సంతోషకరం. ఆయన రాకతో కావలిలో పార్టీకి మరింత బలం చేకూరింది. పార్టీలో ఆయనకు సముచిత స్థానం లభిస్తుందని ఆశిస్తున్నాను.