నెల్లూరు రూరల్ 23వ డివిజన్ పడారుపల్లిలో ఈరోజు నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇతర నాయకులతో కలసి..
నెల్లూరు రూరల్ 23వ డివిజన్ పడారుపల్లిలో ఈరోజు నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇతర నాయకులతో కలసి ఎన్నికల ప్రచారం చేశాను. నెల్లూరులో టీడీపీకి అభ్యర్ధులు కూడా దొరకని స్థితిలో దిక్కులేక వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన వారిని నిలబెట్టారు. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం ఇలాంటి కుట్ర రాజకీయాలే. ఆ కుట్ర రాజకీయాలు ఇప్పుడు నెల్లూరుకు కూడా తీసుకొచ్చారు. ఇలాంటి కుట్రలను వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి చూస్తూనే ఉంది. 2014 నుంచి 19 మధ్య కాలంలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పటికీ అధికారంలోకి వచ్చాం. పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉన్నన్ని రోజులు ఇలాంటి కలుపుమొక్కల గురించి కార్యకర్తలు ఆలోచించాల్సిన అవసరం లేదు. నెల్లూరు అభివృద్ధి బాధ్యత నాది. మీరు ఓటు వేసి నిశ్చింతగా ఉండండి. నాకూ, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించండి.