టీడీపీ, జనసేన పార్టీల కుట్రలు, సీఎం జగన్ గారు చేస్తున్న మంచిని యువత గ్రహిస్తున్నారు.
టీడీపీ, జనసేన పార్టీల కుట్రలు, సీఎం జగన్ గారు చేస్తున్న మంచిని యువత గ్రహిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు నెల్లూరు సిటీ 50, 51వ డివిజన్ల నుంచి టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన 200 మంది యువకులు పార్టీ 51వ డివిజన్ ఇన్చార్జ్ శ్రీ కాయల సురేష్, పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీ సీహెచ్ కిషన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రామమూర్తి నగర్ లోని నా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఖలీల్ అహ్మద్ లతో కలిసి ఆ యువకులందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.