రాష్ట్రంలో ముస్లింల మనోభావాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ముస్లింలను గౌరవిస్తూ..
రాష్ట్రంలో ముస్లింల మనోభావాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ముస్లింలను గౌరవిస్తూ, వారికి అండగా నిలుస్తూ వస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో ఏడుగురు ముస్లిం అభ్యర్ధులను పోటీలో నిలబెట్టారు సీఎం జగన్ గారు. నెల్లూర జిల్లాలో శాంతిభద్రతలు, మతసామరస్యం వెల్లివిరివిరిస్తోందంటే అందుకు ముస్లింలు అందిస్తున్న సహకారమే కారణం. వైఎస్ఆర్‌సిపి తూచా తప్పకుండా సోషల్ ఇంజినీరింగ్ పాటిస్తూ ఆయా కులాలు, మతాలకు వారి జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఉండాలనేది జగన్ గారి ఎజెండా.
మైనార్టీలు కూడా ఆర్ధికంగా, సామాజికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో జగన్ గారు పని చేస్తున్నారు. కాబట్టి నెల్లూరు జిల్లాలో వివిధ పార్టీలలో ఉన్న ముస్లింలు సైతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ఈ క్రమంలోనే మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ గారిని నెల్లూరులోని ఆయన నివాసంలో పార్టీ నాయకులతోపాటు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాను. ఆయనకు భవిష్యత్తులో పార్టీలోను, ప్రభుత్వంలోను మంచి పదవులు వస్తాయనే నమ్మకం నాకుంది.