పేదల జీవితాలను మార్చే పాలనకు మేం మద్దతుగా ఉంటాం.
పేదల జీవితాలను మార్చే పాలనకు మేం మద్దతుగా ఉంటాం. మళ్ళీ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సర్వశక్తులా కష్టపడతామని ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలానికి చెందిన పదిమంది గ్రామ సర్పంచ్లు, నలుగురు ఎంపిటిసిలు ఈరోజు రామమూర్తి నగర్లోని నా క్యాంపు కార్యాలయంలో నన్ను కలిసిన సందర్భంగా స్పష్టం చేశారు. పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్ళినా ఏ విధమైన నష్టం లేదని ప్రజల మద్దతు మనకే ఉందని వారు ధీమా వ్యక్తం చేయడం సంతోషాన్నిచ్చింది. ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని వారు మాటిచ్చారు. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని నేను వారికి హామీ ఇచ్చాను.