ప్రైవేటు టీచర్లకు అండగా ఉంటా..

ప్రైవేటు టీచర్లకు అండగా ఉంటా..
ప్రైవేటు టీచర్లకు అండగా ఉంటా…
నెల్లూరు జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేసే సిబ్బందికి అండగా నేనున్నాను. ఏ సమస్య వచ్చినా పరిష్కరించే బాధ్యత నాదని మాటిస్తున్నాను. నేడు కస్తూరిదేవి గార్డెన్స్ వద్ద జరిగిన ఆత్మీయ సమావేశంలో ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. టీచర్లకు హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు కేటాయించే విషయాలపై సిఎం జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తాము. ఈ కార్యక్రమంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్, ఎమ్మెల్సీలు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ శ్రీ కర్తం ప్రతాప్ రెడ్డి గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది.