విశ్వ బ్రాహ్మణ సమాజానికి తోడుగా ఉంటా..

విశ్వ బ్రాహ్మణ సమాజానికి తోడుగా ఉంటా..
విశ్వ బ్రాహ్మణ సమాజానికి తోడుగా ఉంటా
విశ్వబ్రాహ్మణు వంటి చేతి వృత్తులపై ఆధారపడే కులాల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటా. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి అతిథిగా హాజరయ్యా. సిటీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్ గారు, ఎమ్మెల్సీ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, శ్రీ ఆనం విజయకూమార్ రెడ్డి తదితరులతో కలసి పాల్గొన్న ఈ సమావేశంలో విశ్వబ్రాహ్మణ సామాజికవర్గ ప్రజల కష్టాలు అడిగి తెలుసుకున్నాను. వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉండటమే కాకుండా విశ్వబ్రాహ్మణ భవనానికి నా ఎంపీ లాండ్స్ నిధులు మంజూరు చేయిస్తానని స్పష్టం చేస్తున్నాను.