ఈ నెల 16న విజయనగరంలోకి ప్రజాసంకల్పయాత్ర

ఈ నెల 16న విజయనగరంలోకి ప్రజాసంకల్పయాత్ర

ఈ నెల 16న విజయనగరంలోకి ప్రజాసంకల్పయాత్ర

Vijayasai Reddy Explain Ys Jagan Meetings - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. ఈ నెల 16న విజయనగరంలోకి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రవేశించనుంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, తదితర అంశాలపై చర్చించేందుకు పలు సంఘాలు, న్యాయవాదులు, పార్టీ కార్యకర్తలతో వైఎస్‌ జగన్‌ భేటి ఉంటుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఈ నెల 10న సిరిపురం విజ్ఞాన్‌ గ్రౌండ్‌లో బ్రాహ్మణులతో ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని వివరించారు. అదే విధంగా వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఈ నెల11న వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తలు సమావేశం ఉంటుందని.. ఈ సమావేశానికి 175 అసెంబ్లీ, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, కో ఆర్డినేటర్లు హాజరవుతారన్నారు. ఈ నెల 12న అరిలోవ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ముస్లింలతో వైఎస్‌ జగన్‌ ఆత్మీయ సమవాశం ఉంటుదన్నారు. అదేవిధంగా ఈ నెల 15న న్యాయవాదులు వైఎస్‌ జగన్‌ను కలవనున్నారని వివరించారు.