‘మా నోట్లను మేమే ముద్రించుకుంటామంటారేమో’

‘మా నోట్లను మేమే ముద్రించుకుంటామంటారేమో’

‘మా నోట్లను మేమే ముద్రించుకుంటామంటారేమో’

Vijayasai reddy Satirical Tweets On CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఐదేళ్లకోసారి ఎన్నికలలతో అభివృద్ధి నిలిచిపోతుందని 2050 వరకూ ఎలక్షన్లు అవసరం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవో తెచ్చినా తెస్తాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు పొంతన లేకుండా పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.

విమానాశ్రయంలో  ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హత్యకు స్కెచ్‌ వేసి అది కేంద్ర నియంత్రణలో ఉంది..మాకేం సంబంధం లేదన్న చంద్రబాబు.. ఇప్పుడు సీబీఐని రాష్ట్రంలోకి అడుగుపెట్టనిచ్చేది లేదనడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ పెద్ద నోట్లు రద్దు చేసి ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశాడని.. అందుకే మా నోట్లను మేమే ముద్రించుకుంటామని  చంద్రబాబు జీవో తెచ్చిన తెస్తాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మానసిన స్థితి బాగాలేదని, ఆయన్ని డాక్టర్లకు చూపించాలంటూ పదునైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


Recommended Posts