సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మాకు…ముఖ్యంగా మహిళల నుంచి వస్తున్న విశేష స్పందన, ఆదరణ, అభిమానం మరువలేనిది.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మాకు…ముఖ్యంగా మహిళల నుంచి వస్తున్న విశేష స్పందన, ఆదరణ, అభిమానం మరువలేనిది. నేడు కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం కమ్మపాలెం గ్రామం సంజీవ్ నగర్ లో నిర్వహించిన ప్రచారంలో సైతం మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ సోదరుల మాదిరి మమ్మల్ని ఆహ్వానించడం వారి కష్టసుఖాలు మాతో పంచుకోవడం మరచిపోలేని అనుభూతి. ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారిని తప్పక గెలిపించుకుంటామని వారు మాట ఇవ్వడం సంతోషాన్నిచ్చింది. వారికి ఏ కష్టమొచ్చినా అండగా నిలబడతానని మాటిస్తున్నాను.