కోవూరు నియోజకవర్గం, విడవలూరు మండలోని పార్లపల్లి గ్రామంలో ఈరోజు..
కోవూరు నియోజకవర్గం, విడవలూరు మండలోని పార్లపల్లి గ్రామంలో ఈరోజు నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నేత శ్రీ తిక్కవరపు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటువేసే ముందు జగనన్న చేసిన మంచిని గుర్తు చేసుకోవాలని, సంక్షేమ పథకాలు కొనసాగేందుకు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని గ్రామస్తులను అభ్యర్ధించారు. ప్రచారంలో పాల్గొన్న ఎంపీటీసీ శ్రీమతి దాసరి శైలజ, పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాదవయ్య, నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరికి అలాగే ఆదరించిన ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.